వంట చేయమనడం అవమానించడం కాదు

వంట చేయమనడం అవమానించడం కాదు

వంట సరిగా చేయమని భార్యను కోరడం అవమానించడం కాదని బాంబే హైకోర్ట్ తీర్పునిచ్చింది. 17 ఏళ్ల కిందట ఓ మహిళ అత్తారింట్లో తనను చిన్నచూపు చూస్తున్నారని.. భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో విషం తాగి ఆత్మహత్య చేసుకొంది. ఆ కేసు విచారణ సందర్భంగా భార్యను వంట బాగా చేయమనడం, ఇంటిపని చేయమని కోరడం వేధింపుల కిందికి రావని జస్టిస్ సారంగ్ కోత్వాల్ తీర్పునిచ్చారు. ఇల్లాలిని ఇంటిపని, వంటపని చేయాలనడం పీడన కిందికి తెచ్చేందుకు ఆధారాలు లేవని.. దీనిని ఆత్మహత్యకు ప్రేరేపించే నేరంగా సూచిస్తూ ఐపీసీలో ఎక్కడా పేర్కొనలేదని వ్యాఖ్యానించింది. దీంతో తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే నేరం నుంచి సాంగ్లీకి చెందిన ఓ వ్యక్తిని, అతని తల్లిదండ్రులను బాంబే హైకోర్ట్ నిర్దోషులుగా విడుదల చేసింది.