అశ్విన్ : ఇంట్లో ఉండకపోతే మీరు అదే...?

అశ్విన్ : ఇంట్లో ఉండకపోతే మీరు అదే...?

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం భారత్ లో అంతకంతకు పెరిగిపోతుంది. అందుకే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించారు. అయితే ప్రజలు ఆ విషయాన్ని పట్టించుకోకుండ మామూలుగానే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అయితే ఈ వైరస్ విషయం లో ప్రజలకు అవగాహనా కల్పించేందుకు సినిమా సెలబ్రెటీలు, భారత క్రికెటర్లు ఎల్లప్పుడూ అవగాహనా కల్పిస్తూనే ఉన్నారు. అయితే లాక్ డౌన్ విధించిన తరువాత కూడా ప్రజలు బయటికి రావడాన్ని ఉద్దెశించి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ట్విట్ చేసాడు.  ప్రజలు బయటికి వస్తే ప్రజలు మాన్కడింగ్ అవుతారని తెలిపాడు. అందులో... ''ఎవరో నాకు ఈ ఫోటో పంపించారు. ఈ రన్ అవుట్ జరిగి సరిగ్గా ఒక సంవత్సరం అవుతుందని తెలిపారు. అయితే ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. కాబట్టి ఇది ప్రజలకు గుర్తు చేయాలి. బయటకు తిరగకండి. లోపల ఉండండి, సురక్షితంగా ఉండండి'' అంటూ ట్విట్ చేసాడు. ఆ ఫోటో.. గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో అశ్విన్ బట్లర్ ను మాన్కడింగ్ చేసిన విషయానికి సంబంధించింది.