రివ్యూ: అశ్వథ్థామ

రివ్యూ: అశ్వథ్థామ

నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, సత్య, పోసాని తదితరులు 

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల 

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి 

నిర్మాత: ఉష మూల్పూరి 

దర్శకత్వం: రమణతేజ 

నాగశౌర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మెప్పిస్తున్నాడు.  వరసగా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.  సొంతంగా బ్యానర్ ను స్థాపించి అందులోనే సినిమాలు చేస్తున్న నాగశౌర్య ఇప్పుడు రచయితగా కూడా అవతారం ఎట్టి కథను రెడీ చేసుకున్నారు.  ఆ కథతో చేసిన సినిమా  అశ్వథ్థామ.  ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి అది ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దామా... 

కథ: 

నాగశౌర్యకు తన చెల్లి సర్గున్ కౌర్ అంటే ప్రాణం.  చెల్లి నిశ్చితార్ధం జరుగుతుందని తెలుసుకొని అమెరికా నుంచి ఇండియా వస్తాడు.  అందరు హ్యాపీగా ఉన్న సమయంలో అనుకోని విధంగా షాక్ తగులుతుంది.  చెల్లి ఆత్మహత్యాయత్నం చేస్తుంది.  కారణం ఆమె గర్భవతి.  ఎవరు ఏంటి అంటే తనకేమి తెలియదని చెప్తుంది.  ప్రేమ వ్యవహారాలు ఏమి లేవని తెలుసుకుంటాడు.  అయితే, ఇలాంటి సంఘటనతోనే మరో అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని తెలుసుకున్న నాగశౌర్య దీని వెనుక ఏదో మాఫియా ఉందని, దానిని కనిపెట్టాలని అనుకుంటాడు... ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

ఒక థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన అన్ని హంగులు సినిమాలో ఉన్నాయి.  అన్ని హంగులకు తగ్గట్టుగా సినిమా ఉన్నది.  థ్రిల్లర్ సినిమా కాబట్టి మలుపు అన్నవి కామన్.  అయితే, ఆ మలుపులను ఎంత థ్రిల్లింగ్ గా చూపించారు అన్నది ముఖ్యం.  ఈ విషయంలో  అశ్వథ్థామ యూనిట్ సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది.  ఫస్ట్ హాఫ్ లో కుటుంబనేపథ్యం, ఆ తరువాత విలన్ ను పట్టుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి.  సెకండ్ హాఫ్ లో కొంతమేర హింస ఇబ్బంది పెడుతుంది.  అదే సమయంలో సైకో విలన్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఆకట్టుకుంటుంది.  అంతేకాదు, సైకో విలన్  కోసం హీరో చేసే ఇన్వెస్టిగేషన్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. 

నటీనటుల పనితీరు: 

ఇప్పటి వరకు లవ్ ఓరియెంటెడ్ సినిమాల్లో మెప్పించిన నాగశౌర్య, మొదటిసారి థ్రిల్లింగ్ సినిమాలో మెప్పించారు.  నటుడిగానే కాకుండా, కథ, రచయితగా కూడా మెప్పించాడు.  సినిమాను తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాడు.  యాక్షన్, భావోద్వేగాలు పలికించడంలో నాగశౌర్య సఫలం అయ్యాడు.  ఇక విలన్ గా చేసిన జిషుసేన్ గుప్త సినిమాకు హైలైట్ అయ్యాడు.  హీరోయిన్ సోదరిగా నటించిన సర్గున్ మెప్పించింది.  మెహ్రీన్ గ్లామర్ పాత్రకు పరిమితం అయ్యింది.  మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపించింది.  రమణతేజ దర్శకత్వం సినిమాకు ప్లస్ అయ్యింది.  అయితే, సెకండ్ హాఫ్ పై ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది.  అలానే శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఆకట్టుకోగా, నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

నాగశౌర్య 

నెగెటివ్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు 

చివరిగా:  అశ్వథ్థామ : థ్రిల్ చేశాడు.