ధోని కెరియర్ కు ఐపీఎల్ తో  సంభంధం లేదు...

ధోని కెరియర్ కు ఐపీఎల్ తో  సంభంధం లేదు...

2019 ప్రపంచ కప్ తర్వాతి నుండి భారతదేశం తరపున మహేంద్ర సింగ్ ధోని ఆడలేదు. ఆ తర్వాతి నుండి అతని కెరియర్ పై చాల ప్రశ్నలు వచ్చాయి. ధోని ఇప్పుడు ఏమి చేస్తారు? అతను భారత జట్టులో తిరిగి వస్తాడా? అంతర్జాతీయ క్రికెట్లో తన చివరి మ్యాచ్ ఆడాడా? ఈ ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ధోని అభిమానులను కలవరపెడుతున్నాయి. అయితే మాజీ కెప్టెన్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగా స్పందించలేదు. ఇక సెప్టెంబరులో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌లో మంచి ప్రదర్శన చేస్తే  అది ధోని జాతీయ జట్టులో తిరిగి రావడానికి సహాయపడుతుందని చాలా మంది భావిస్తున్నారు.

అయితే ఐపీఎల్ 2020 ధోని భారత జట్టులోకి తిరిగి రావడానికి చివరి మార్గం కాకూడదని, ఈ టోర్నీ ప్రదర్శన ధోని అంతర్జాతీయ భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని అతని మాజీ సహచరుడు ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. నేను సెలెక్టర్, కెప్టెన్ లేదా కోచ్ ఏదైనా ఎంఎస్ ధోని ఆడటానికి సిద్ధంగా ఉంటే మాత్రం అతను నా జట్టులో మొదటి ఆటగాడిగా ఉంటాడు అని చెప్పాడు. ధోని నాకు తెలిసినంతవరకు, భారతదేశం కోసం తన చివరి ఆటను సంతోషంగా ఆడుతాడని నేను భావిస్తున్నాను. ఎంఎస్ ధోని ఇంకా మనకు నిరూపించడానికి ఏమీ లేదు అని నెహ్రా అన్నారు