దక్షిణాఫ్రికా పర్యటన పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

దక్షిణాఫ్రికా పర్యటన పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

ఆగస్టులో దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని, అలాంటి అవకాశం గురించి మాత్రమే చర్చలు జరిగాయని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమల్ క్రికెట్ దక్షిణాఫ్రికా భారత్ తప్పకుండ పర్యటనకు వస్తుంది అని చెప్పిన మాటలను ఖండించారు. క్రికెట్ దక్షిణాఫ్రికా  డైరెక్టర్ గ్రేమ్ స్మిత్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫాల్ అంతకముందు మాట్లాడుతూ, ఆగస్టులో మూడు టీ 20 అంతర్జాతీయ పోటీల కోసం దక్షిణాఫ్రికా  లో పర్యటించడానికి భారత్ అంగీకరించిందని, ఇది కరోనా అనంతరం ప్రపంచంలో క్రికెట్ పునః ప్రారంభించడాన్ని సహాయపడుతుంది అని తెలిపారు కానీ ధుమల్ ఈ వ్యాఖ్యలను అంగీకరించలేదు. ప్రస్తుతం, మేము జూలైలో శ్రీలంకలో పర్యటించగలమా లేదా అనేది కూడా స్పష్టానంగా చెప్పలేం, కాబట్టి మేము దక్షిణాఫ్రికా పర్యటనలో ఎలా పాల్గొనగలం? " అని ధుమల్ చెప్పారు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.