ఐపీఎల్ ఒక మనీ మిషన్... 

ఐపీఎల్ ఒక మనీ మిషన్... 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను మనీ మిషన్ అని పిలవడం పట్ల బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ తన నిరాశను వ్యక్తం చేశారు, నగదు సమృద్ధిగా ఉన్నఈ  టోర్నమెంట్ ద్వారా వచ్చే ఆదాయం బోర్డుకు కాదు, దేశానికి వస్తుంది అని తెలిపాడు . కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దిగజారుతున్న పరిస్థితుల వల్ల ఐపీఎల్ 2020 నిలిపివేయబడింది. అయితే 20 ప్రపంచ కప్‌ను వాయిదా ను ఐసీసీ నిర్ణయించినట్లయితే, సెప్టెంబర్-అక్టోబర్ విండోలో ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వాలని బీసీసీఐ చూస్తుంది. ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమల్ మాట్లాడుతూ, "ఐపీఎల్ ఆడటం సురక్షితంఅని బీసీసీఐ భావిస్తేనే అది జరుగుతుంది. అయితే ఈ మధ్య ఐపీఎల్ ఓ డబ్బు సంపాదించే మిషన్ అని ప్రచారం సాగుతుంది, నిజం చెప్పాలంటే ఐపీఎల్ వల్ల డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బును ఎవరు తీసుకుంటారు?  "ఆ డబ్బు ఆటగాళ్లకు వెళుతుంది, ఆ డబ్బు బీసీసీఐ కి వెళ్ళదు. ఆ డబ్బు దేశ సంక్షేమానికి, ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమకు,అలాగే మిగిలిన పరిశ్రమలకు, పన్నుల పరంగా ప్రభుత్వానికి  వెళ్తుంది. ఐపీఎల్ ఒక మనీ మిషన్ అని ప్రచారం చేస్తున్న మీడియా తన వైఖరిని మార్చుకోవాలి మరియు జరుగుతున్న ఈ టోర్నమెంట్ యొక్క ప్రయోజనం గురించి ప్రజలకు చెప్పాలి. క్రీడలకు ఖర్చు చేయడం కంటే వాటి ద్వారా డబ్బు సంపాదించబడుతుంటే మీరు సంతోషంగా ఉండాలి అని తెలిపారు.