ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్...

ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్...

భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ఐపీఎల్ 2020 కోసం ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు కారణం అర్జున్ టెండూల్కర్ పోస్ట్ చేసిన ఓ ఫోటోనే. ప్రస్తుతం యూఏఈ లో ఉన్న అర్జున్ బీసీసీఐ నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తిచేసుకొని ముంబై జట్టుతో కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కుమారుడు అర్జున్ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. అయితే తాజాగా అర్జున్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో అర్జున్ ముంబై ఆటగాళ్లతో కలిసి స్విమింగ్ పుల్ లో ఉన్నాడు. అయితే అందులో ఉన్నవారందరు ఫాస్ట్ బౌలర్ లు కావడంతో అర్జున్ కూడా ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడబోతున్నాడు అని సచిన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విషయానికి సంబంధించి ముంబై యాజమాన్యం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన అన్ని జట్లు తమ తమ నెట్స్ బౌలర్లను వెంట తీసుకెళ్లాయి. ఇక అర్జున్ కూడా ముంబై ఇండియన్స్ నెట్స్ బౌలర్లలో ఒకడు. కానీ అతను ఈ ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకున్న లసిత్ మలింగ స్థానంలో ఆడనున్నాడు అని ప్రచారం జరుగుతుంది.