కోర్టులో కొనసాగుతున్న 'వకీల్ సాబ్' గవర్నమెంట్ వాదన

కోర్టులో కొనసాగుతున్న 'వకీల్ సాబ్' గవర్నమెంట్ వాదన

'వకీల్ సాబ్' కేసు మళ్లీ కోర్టుకు చేరింది! ఆంధ్రప్రదేశ్ లో పవర్ స్టార్ న్యూ మూవీ కాంట్రవర్సీ అంతకంతకూ పెద్దదవుతోంది. మొదట 'వకీల్ సాబ్' మూవీకి ఏపీ గవర్నమెంట్ ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదంటూ జీవో రీలీజ్ చేసింది. బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలు కుదరవని జగన్ సర్కార్ తేల్చేసింది. అంతే కాదు, టికెట్ రేట్లు కూడా పెంచటానికి వీలు లేకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. దాంతో 'వకీల్ సాబ్' టీమ్ కోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ మూడు రోజుల పాటూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ ఆర్డర్ పాస్ చేసింది. కానీ, ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించింది..

 హైకోర్టులో 'వకీల్ సాబ్' మూవీ టికెట్ రేట్స్ హైక్ కి సంబంధించి వచ్చిన అనుకూల తీర్పుని హౌజ్ మోషన్ పిటీషన్ ద్వారా ఛాలెంజ్ చేసింది. కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. 

త్వరలో తిరుపతి ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇటువంటి పొలిటికల్ డ్రామా అందరూ ఊహించిందే. అయితే, పవన్ కళ్యాణ్‌ కోర్ట్ డ్రామా మూవీకి టికెట్ రేట్లు పెంచుకోవటం అత్యవసరం. కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో ఎంత మంది థియేటర్ కి వస్తారనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే, స్పెషల్ షోస్, టికెట్ రేట్లు పెంచటం ద్వారా ఫిల్మ్ మేకర్స్ ఆదాయం పెంచుకున్నారు. తెలంగాణలో ఈ వ్యూహం బాగానే వర్కవుట్ అయినప్పటికీ ఆంధ్రాలో జనసేనాని రాజకీయ ఎత్తుగడల వల్ల 'వకీల్ సాబ్'కి సెగ తప్పటం లేదు. ఇక 'ఉగాది' సెలవుల నేపథ్యంలో కోర్టు ప్రభుత్వం న్యాయవాదులు వేసిన 'హౌజ్ మోషన్ పిటీషన్ స్వీకరిస్తుందా? స్వీకరిస్తే ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది చూడాలి.