తెలకపల్లి రవి విశ్లేషణ: తెలుగు సీఎంలు నిజంగా పోట్లాడుకుంటారా?

తెలకపల్లి రవి విశ్లేషణ: తెలుగు సీఎంలు నిజంగా పోట్లాడుకుంటారా?

రైతులకోసం దేవుడితోనైనా పోట్లాడతానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నదీజలాలపై అధికారులతోసమీక్షలో అన్నట్టు పతాక శీర్షికువచ్చాయి, రాయసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు నీటి నిల్వ విస్తరణతో తలెత్తిన వివాదంపై  ఎపి ముఖ్యమంత్రి జగన్‌తో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ సమక్షంలో అక్టోబరు ఆరున  అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో ఆయన ఈ మాటన్నారు.  అంతకు ముందు కూడా దీనిపై కెసిఆర్,‌ కెటిఆర్‌ కూడా స్పందించారు. జగన్‌తో రాజకీయంగా వ్యక్తిగతంగా సన్నిహితంగా వుంటారని పేరొందిన టిఆర్‌ఎస్‌ అధినేతలు  ఆ స్నేహం వున్నా కావాలని వివాదానికి వస్తే తేల్చుకుంటామన్నట్టు మాట్లాడటం వూహించదగిందే. అదే సమయంలో జగన్‌ కూడా రాజీలేని విధంగా  వాదనలు రూపొందించుకుంటున్నట్టు వార్తలున్నాయి.  తెలంగాణ ఎడిషన్లలోనూ పత్రికలోనూ కెసిఆర్‌ ప్రభుత్వవాదనలు విస్తారంగా వచ్చాయి.సందర్భోచితంగా పదునుగానేగాక పరుషంగానూ మాటు ఉపయోగించేందుకు వెనుకాడకపోవడం  కెసిఆర్‌ సహజ స్వభావం, వాస్తవానికి భాష ప్రయోజనమే అది. అర్థంతో పాటు ఆవేశాలనూ ఆలోచనాసరళిని అవి ప్రతిబింబించాలి.అయితే ఆమాటలన్ని  ఆచరణలో అలాగే అమలవతాయనుకోవడం అవాస్తవికత అవుతుంది. ముఖ్యమంత్రలు సమావేశంలో మాట్లాడుకోవడం వాదనలు వినిపించడం,పత్రాలు, మ్యాపులు ఇచ్చిపుచ్చుకోవడం తప్ప కొట్లాడుకోవడాలు వుండవు. తాత్కాలికంగా ఏదో ఒక అంశం వరకూ అంగీకారానికి వచ్చి మరో తేదీన చర్చ కొనసాగించానుకోవడంతో ముగుస్తుంటాయి.సమస్యనూ తత్వాలనూ బట్టి వాడీ వేడీ ఆపరిధిలోనే వుంటాయి.పైగా రాజకీయ వేత్తలు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు  లేదా కేంద్ర నేతల స్నేహసంబంధాను అనేక అంశాలు ముఖ్యంగా రాజకీయాలు ప్రభావితం చేస్తాయి.వారిద్దరూ ఒకటేననడం, లేదా ఇద్దరి మధ్యచెడిపోయిందని నిర్ధారించడం అపరిపక్వతే.

నదీజలాల వివాదాలు దీర్ఘకాలికమైనవి.దేశ చరిత్రలో రెండు ఇంకా అంతకు మించి రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు లేదా గతం నుంచి సంక్రమించి నసమస్యు ఒక పట్టాన తేలవనడానికి కావేరి జలాల కన్నా ఉదాహరణ అవసరం లేదు. ఒకటిగా వున్నప్పుడే మూడుప్రాంతాకు సంబంధించిన నదీజలాల  పంపిణీపై తెలంగాణ   కోస్తా రాయలసీమ మధ్య చాలా వాదనలు నడుస్తూవచ్చాయి.రాష్ట్ర విభజనకు దారి తీసిన కారణాల్లో అవీ ముఖ్యమైనవే. విడిపోక ముందు కృష్ణానదిపై బచావత్‌, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునళ్లు ఇచ్చిన ఉమ్మడి వాటా పరిధిలోనే రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సిన స్థితి.  చివరగా కెసిఆర్‌కు మొదటినుంచి నదీ ప్రాజెక్టు ప్రవాహాలపై ఎడతెగని ఆసక్తి అధ్యయనం. అబ్సెషన్‌ అన్నా తప్పులేదు. ఎందుకంటే  ఉద్యమ కాలంలోనూ తర్వాత పాలన తొలినాళ్లలోనూ ఎవరం ఎప్పుడు కలిసినా గంటల తరబడి వాటిగురించే మాట్లాడేవారు. శాసనసభలో తనే పవర్‌ పాయింట్ ‌ప్రెజంటేషన్‌ కూడా ఇచ్చారందుకే. కాళేశ్వరంను అందరి సలహాకు భిన్నంగా తనకు నచ్చిన రీతిలో  ఎత్తున కట్టి బాహుబలి పంపు ద్వారా నీరు పారించడం ఆయన పట్టుదలకు ఒక ఉదాహరణ. కృష్ణా గోదావరి నదులో నీటిని సరిగ్గా వాడుకుంటే రెండు రాష్ట్రాలో  ఎన్నో రెట్లు వినియోగించుకోవచ్చని కెసిఆర్‌  నమ్ముతారు,  తెంగాణలో నీరు సమృద్ధిగా పారించి పండించి  తేడాచూపించాలని  ఆయన ప్రథమవ్యూహం.విమర్శలెన్నివున్నా ఈవాస్తవాన్ని కాదనడానికిలేదు. చంద్రబాబు హయాంలోనూ ఒకసారి రాజ్‌భవన్‌లో ఆయన సానుకూల ధోరణిలో మాట్లాడారుగాని ఓటుకునోటువంటివి పరిస్తితిని తలకిందులు చేశాయి.

              జగన్‌కూ కెసిఆర్‌కు కూడా  టిడిపి అధినేత చంద్రబాబునాయుడు  ప్రధాన ప్రత్యర్తిగా వున్నప్పుడు వారు చేరువయ్యారు. గత ఎన్నికముందు ఆయన ప్రకటించిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు జగన్‌ మద్దతు తెలిపారు,గెలిచాక కలిసి మాట్లాడారు. సచివాలయ భవనాలు అప్పగించారు. ఈ వూపు ఎక్కువగా వున్నప్పుడే గోదావరి మిగులు జలాలపై  ఉభయ రాష్ట్రాల ఉమ్మడిప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పుదల కుదిరినట్టువెల్లడించారు. అఖిపక్ష చర్చలు ముందస్తు ప్రణాళికలు లేకుండా ఏకపక్షంగా అకస్మాత్తుగా అలాటి ప్రకటన రావడం సహజంగానే విమర్శకు గురైంది.కాళేశ్వరం ప్రారంభోత్సవానికి  అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు జగన్‌కూడా హాజరవడంపై దుమారం రేగినా ఆయన ఆగలేదు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆపేందుకు చేసిందేమీ లేదంటూ జగన్‌ కెసిఆర్‌ ఉదారంగా వున్నారని శాసనసభలోప్రశంసలు కురిపించారు. అయితే ఇటీవలే విడిపోయిన రెండురాష్ట్రాల ఉమ్మడి నదీప్రాజెక్టులు  సంక్లిష్టమే గాక సంవిధానంలో సమస్యాత్మకమని కూడా కొద్దికాలంలోనే గుర్తించడం అనివార్యమైంది. ఎవరికివారు తమ తమ ఇరిగేషన్‌ నిర్ణయాలతో ముందుకుసాగడానికి అది కారణమైంది. ప్రతి సీజన్‌లో సాగర్‌ జలాల పంపిణీ శ్రీశైలం నీళ్లు తీసుకోవడం నిల్వవివాదంగా వుంటూనే వున్నాయి. మీటర్లుకూడా ఏర్పాటు చేసేవరకూవెళ్లింది.ఇటీవల జగన్‌ పోతిరెడ్డిపాడు నిల్వ సామర్థ్యంపెంచి శ్రీశైలం నుంచి త్వరగా తీసుకోవాలని ప్రతిపాదించడంతో వివాదం మళ్ళీ ముదిరింది.మాకు కేటాయించిన నీటినే నిల్వ వున్నప్పుడే తీసుకోవడం తప్ప ఎక్కువ తీసుకోవడం తమఉద్దేశంకాదని ఎపి వాదన.ఇప్పటికే ఎక్కువ తీసుకుంటూ అనుమతి లేనివిస్తరణ ఎలా చేస్తారన్నది తెలంగాణ ప్రశ్న.ఎపివి అనుమతిలేని ప్రాజెక్టులని తెలంగాణ,మీరే అనధికారికంగా కట్టేస్తున్నారని ఎపి వాదించుకోవడం పెరిగింది. విభజనసమస్యల్లో అత్యధికం అపరిష్క్రతంగా వుండగా ఇది ముందకొచ్చికూచుంది. ఉమ్మడిరాష్ట్రం వున్నప్పటి జలాల పంపిణీ మార్చి విడివిడిగా చేయాలని కూడా తెలంగాణ అంటున్నది.కృష్ణా బోర్డు  నిర్ణయాలపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.  కేంద్రం కూడా ఈ విషయాలపై కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదనే ఆరోపణ కూడాచేసింది. ఈ పూర్వరంగంలోనే కెసిఆర్‌ నిన్న కేంద్రానికి 14 పేజీ లేఖరాశారు.నిధులకోణంలో ఇప్పటికే తెలంగాణ వేల కోట్ల ఖర్చుతో కొన్ని పూర్తి చేసుకోగా జగన్‌ ప్రభత్వం కొత్తచొరవలు  వూపందుకోవలసివుంది.రాజధాని వికేంద్రీకరణ పైనేదృష్టి కేంద్రీకరించింది.పోలవరం బాధ్యత తీసుకున్నకేంద్రంఆర్థిక సహాయంపై మీనమేషాలు లెక్కవేస్తున్నది.రాయసీమ సమస్యలు  ముందుకు వస్తున్నాయి.సహజంగా ఎవరి ప్రయోజనాలు కాపాడుకోవడానికి వారుగట్టిగా వాదించుకుంటారు. తమ ఆధారాలు  లెక్కులు సమర్పిస్తారు.వివిధ కారణాల వల్ల మూడునాలుగు సార్లు వాయిదా పడ్డ ముఖ్యమంత్రు సమావేశంలో ఇవి చర్చకు తీసుకోవడం ఆహ్వానించదగిందే.ఇక్కడ ఏదో కొట్లాడుకుంటారనుకోవడం అవాస్తవికతే. కాకుంటే తమ రాష్ట్రాల్లో పోరాడినట్టు కనిపించేందుకు కొన్ని జరగొచ్చు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జిహెచ్‌ఎంసి ఎన్నికలో వూపు కోసం కూడా గట్టిగా మాట్టాడొచ్చు. అయితే ఇరురాష్ట్రాల మధ్య  సుహృద్భాం అంతసుభంగా చెదిరిపోదు. ఎపిమూలాలు  గల జనాభా తెలంగాణలో గణనీయంగా వుంది. వారిఆదరణ ఓటింగు టిఆర్‌ఎస్‌కు చాలా అవసరం.టిడిపి దెబ్బతిన్నాక వారిని పూర్తిగా తనవైపు తిప్పుకోవాలనుకుంటున్న ఆ పార్టీ తదనుగుణంగానే అడుగు వేస్తుంది.ఎపికోణంలో చూస్తే ఇక్కడ నివసించే వారి కుటుంబాలతోపాటు అక్కడి నేతలు  వ్యాపారవేత్తలకు కూడా ప్రధానంగా హైదరాబాదులో ఆర్థిక ప్రయోజనాలు మీడియా వున్నాయి. కనక ఎవరూ పోట్లాటలు  పెంచుకోరు. చర్చు సాగిస్తూనే వుంటారు.నిర్మాణాలు సాగిస్తూనే వుంటారు. పూర్తి అనుమతులతో కట్టిన ప్రాజెక్టులేవీ వుండవు.