ఆ ముఖ్యమంత్రి స్పందిస్తేనే...బస్సులు...

ఆ ముఖ్యమంత్రి స్పందిస్తేనే...బస్సులు...

అన్ లాక్ ప్రక్రియ మొదలైన చాలా రోజులైంది.  అంతర్రాష్ట్ర సర్వీసులకు కేంద్రం అనుమతించింది.  కానీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపే విషయంలో అనేక మార్లు చర్చలు జరిపారు.  మొదట ఏపీఎస్ఆర్టీసీ 2 లక్షల 60 వేల కిలోమీటర్లు తిప్పుతామని ప్రతిపాదన పెట్టింది.  ఈ ప్రతిపాదనను టిఎస్ ఆర్టీసీ అంగీకరించలేదు.  ఆ తరువాత ఏపీఎస్ఆర్టీసీ లక్షా 60వేల కిలోమీటర్లకు సంబంధించిన రూట్ మ్యాప్ ను టిఎస్ఆర్టీసీకి పంపింది.  దీంతో పాటుగా తెలంగాణ భూభాగంలో ఏపీ తిప్పనున్న రోటీల ప్రతిపాదనలు, బస్సుల సంఖ్యతో కూడిన నివేదికను సీఎం కేసీఆర్ కార్యాలయానికి ఏపీ అధికారులు పంపించారు.  ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదిస్తే రెండు మూడు రోజుల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను పునరుద్దరించే అవకాశం ఉన్నది.  మరి కేసీఆర్ ఈ విషయంలో ఎలా స్పందిసారో చూడాలి.