‘ఏప్రిల్ 28న ఏం జరిగింది ?’ ప్రీ రిలీజ్ ఈవెంట్ - LIVE

‘ఏప్రిల్ 28న ఏం జరిగింది ?’ ప్రీ రిలీజ్ ఈవెంట్ - LIVE

రంజిత్, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ సినిమా ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది ?’. వీజీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వీరాస్వామి దర్శకనిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు లాంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఫిబ్రవరి 27వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ప్రసాద్ లాబ్స్ లో జరుగుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో నిఖిల్, బిగ్ బాస్ సయ్యద్ సోహెల్ ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు.