కలాం స్ఫూర్తి.. భారతానికి మార్గదర్శి..

కలాం స్ఫూర్తి.. భారతానికి మార్గదర్శి..

ఆయ‌న ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో మేరు శిఖరం, భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపిన "మిస్సైల్ మ్యాన్, ప్రపంచం గర్వించదగ్గ సుప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతదేశ ఖ్యాతిని నలుదిక్కుల చాటిన మహా మేధావి, భరత మాత ముద్దు బిడ్డ, నిజమైన భారత రత్నం .. ఆయ‌నే భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్‌గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా. భవిష్యత్ భారతానికి కలాం చేసిన మార్గదర్శనం చిరస్మరణీయం.. ఆయ‌న చెప్పే ఒక్కో మాట‌.. భావిభార‌త పౌరుల్లో, విద్యార్థుల్లో.. ఎన్నో కొత్త ఆలోచ‌న‌లు రేకెత్తిస్తోంది. భ‌విష్య‌త్‌పై క‌ల‌లు క‌నేలా చేస్తోంది.. క‌ల‌లు క‌నండి.. వాటిని స‌హ‌కారం చేసుకోండి అంటూ ఆయ‌న చెప్పిన బోధ‌న‌లు.. ఎంద‌రికో స్పూర్తిగా నిలుస్తాయి.. ఇవాళ ఆయ‌న మ‌హా మేధావి జ‌యంతి.. 

త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో 1931 అక్టోబ‌ర్ 15వ తేదీన జ‌న్మించారు క‌లాం.. తిరుచిరాప‌ల్లిలోని సెయింట్ జోసెఫ్ క‌ళాశాల‌లో భౌతిక శాస్త్రం అభ్య‌సించారు.. చెన్నైలోని మ‌ద్రాస్ ఇనిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి ఏరోస్పేస్ ఇంజ‌నీరింగ్ ప‌ట్టాపొంద‌రు.. భార‌త రాష్ట్రప‌తి ప‌ద‌వి చేప‌ట్ట‌క‌ముందు.. డీఆర్‌డీవో, ఇస్త్రోతో ఒక ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ప‌నిచేశారు.. భార‌త మిస్సైల్ మాన్ అని పిల‌వ‌బ‌డే క‌లాం.. బాలిస్టిక్ క్షిప‌ణి, వాహ‌క ప్ర‌యోగ సాంకేతిక అభివృద్ధికి ఎన‌లేని కృషి చేశారు. 1998లో భార‌త‌దే పోఖ్రాన్ 2 అణు ప‌రీక్ష‌ల్లో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక , రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగారు.. ఆయ‌నకు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మ‌ద్ద‌తు తెలిపింది. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.

ఆయ‌న రాష్ట్రప‌తి హోదాలో ఉన్నా.. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆయ‌న సొంత ఖ‌ర్చుల‌తోనే జీవ‌నం సాగించారు.. త‌న స‌హాయ‌కుల‌తో ఎంతో ప్రేమ‌గా ఉండి.. వారి అవ‌స‌రాల‌ను తీర్చేవారు.. ఆయ‌న జ‌న్మించింది సాధార‌ణ కుటుంబ‌మే.. చ‌దువుకునే రోజుల్లో న్యూస్ పేప‌ర్ కూడా వేసేశారు.. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. 'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడిని . దానికి తోడు చదువుకుంటూ పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది అని ఓ సంద‌ర్భంలో ఆయ‌న చెప్పుకొచ్చారు.. ఇక‌, నాకు ముగ్గురమ్మ అమ్మ‌లు.. ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారంటే ఆయ‌న‌కు అమ్మ‌, సంగీతం, సేవ‌పై ఉన్న మ‌మ‌కారం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. 

ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడిలో మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన అతను 1958లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగులో పట్టా పుచ్చుకున్నారు. పట్టభద్రుడైన తర్వాత అతను భారత దేశపు రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవోలో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్  ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. 1962లో ఇస్రోకు మారారు. అక్కడ అతను ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా అతను కృషి ఎంతో ఉంది. 1982 లో, డీఆర్‌డీవోకు డైరెక్టరుగా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ ల మీద దృష్టి కేంద్రీకరించారు. అగ్ని క్షిపణి , పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు అతనుే సూత్రధారి. దీంతో అతనుకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై 1992లో అతను భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా అతనుకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. అతను కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ 1981లో, పద్మ విభూషణ్  1990లో, భారత రత్న 1997లతో బాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డాక్ట‌ర్ అబ్దుల్ క‌లాం.. ఇవాళ ఆయ‌న జ‌యంతి.. ఈ సంద‌ర్భంగా ఓసారి ఆయ‌ను స్మ‌రించుకుందాం.. ఆయ‌న చెప్పిన ఎన్నో సూక్తుల‌ను ఆచ‌ర‌ణ మార్గంలో పెట్టేందుకు కృషి చేద్దాం.