అల్పపీడనం : రాగల 24 గంటలలో ఏపీలో విస్తారంగా వర్షాలు

అల్పపీడనం : రాగల 24 గంటలలో ఏపీలో విస్తారంగా వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో వచ్చే 24 గంటలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ మీద అల్పపీడనం కేంద్రీ కృతం అయి ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల మేర ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇక అల్పపీడనం కారణంగా   పశ్చిమ దిశ నుంచి 45-55కి.మీ వేగంతో  గాలులు వేస్తాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. 48 గంటల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని మత్య్సకారులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇక ఇప్పటికే కురుస్తున్న వర్షాల వలన చింతపల్లి, వేలేరుపాడులో 4సే.మీ..కోయిదా3,విజయవాడ,వి.ఆర్.పురం,కునవారంలో 2సే.మీ. వర్షపాతం నమోదయ్యాయి.