ఆ డ్రోన్లు చంద్రబాబు నివాసంపైనే పని చేస్తాయా..?

ఆ డ్రోన్లు చంద్రబాబు నివాసంపైనే పని చేస్తాయా..?

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసం దగ్గర డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై డీజీపీకి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు నిలదీయగా... టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు.. ప్రభుత్వం, వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ వరద రాజకీయం చేస్తోందని ఆరోపించిన కళా వెంకట్రావు... వరద ప్రభావిత ప్రాంతాలు.. నీట మునిగిన పంటలు.. వరదల్లో బాధితుల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించవా? అని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం డ్రోన్లతో ఎందుకు చిత్రీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కళా వెంకట్రావు... ప్రభుత్వం పంపిన డ్రోన్లు చంద్రబాబు నివాసం పైనే పని చేస్తాయా..? అంటూ ఎద్దేవా చేశారు. కృష్ణ వరదపై సమీక్ష కానీ.. ఏరియల్ సర్వే కానీ చేయని సీఎం వైఎస్ జగన్ .. రెక్కలు కట్టుకుని విదేశాలకు వెళ్లారని సెటైర్లు వేశారు. ఇకనైనా రాజకీయం పక్కన పెట్టి వరద సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు కళా వెంకట్రావు.