స్పీకర్‌ తమ్మినేనికి తప్పిన ముప్పు...

స్పీకర్‌ తమ్మినేనికి తప్పిన ముప్పు...

స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ప్రమాదం తప్పింది. రాగోలు-పంజంగి మధ్యలో తమ్మినేని కాన్వాయ్‌కి ఓ ఆటో అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. అడ్డువచ్చిన ఆటోను ఢీకొట్టింది స్పీకర్ కారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్పీకర్‌ కారు కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో స్పీకర్ తమ్మినేని మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.