బాలయ్య నటనతో ఎన్టీఆర్ ను మరోసారి చూశాం !

బాలయ్య నటనతో ఎన్టీఆర్ ను మరోసారి చూశాం !

 

నిన్న విడుదలైన క్రిష్, బాలక్రిష్ణల 'ఎన్టీఆర్ - కథానాయకుడు' చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది.  ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించిన తీరు, దర్శకుడు క్రిష్ నాటకీయ రీతిలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.  పలువు రాజకీయ నాయకులు సైతం సినిమాను మొదటిరోజే వీక్షించి పొగడ్తల వర్షం కురిపించారు.  తెలుగుదేశం నేత, స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నిన్న గుంటూరు కెఎస్పి మాల్స్ లో సినిమాను చూసి వాస్తవికను వక్రీకరించకుండా సినిమాను తీశారు.  బాలయ్య నటన రామారావుగారిని మరోసారి చూపించింది, అద్భుతమైన సినిమా అంటూ ప్రశంసించారు.