వైసీపీ ఎమ్మెల్యేకు ఎస్‌ఈసీ నోటీసులు

వైసీపీ ఎమ్మెల్యేకు ఎస్‌ఈసీ నోటీసులు

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం... పంచాయతీ ఎన్నికలయ్యేంత వరకు మీడియాతో మాట్లాడే అంశంలో నిగ్రహం పాటించాలంటూ ఆ నోటీసుల్లో ఎమ్మెల్యే జోగి రమేష్‌ను ఆదేశించింది ఎస్‌ఈసీ.. సమావేశాల్లోనూ సంయమనం పాటించాలని ఆంక్షలు విధించింది. కాగా, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యలపై ఎస్ఈసీ ఫిర్యాదు చేసింది జనసేన పార్టీ.. జోగి రమేష్ వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని.. జోగి రమేష్ ను తక్షణమే హౌస్ అరెస్ట్ చేయాలి.. ఎన్నికలు అయ్యే వరకు బయటకు వదలకూడదని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు జనసేన నేతలు. నీలిపూడి గ్రామంలో ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని జోగి రమేష్ చెప్పారని.. దీంతో.. ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్‌ఈసీ.. ఎమ్మెల్యే జోగు రమేష్‌కు నోటీసులు జారీ చేసింది.