పరిషత్ ఎన్నికల పోలింగ్: మందకొడిగా పోలింగ్... కనిపించని ఓటర్లు... 

పరిషత్ ఎన్నికల పోలింగ్: మందకొడిగా పోలింగ్... కనిపించని ఓటర్లు... 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకపోవడంతో పోలింగ్ మందకొడిగా జరుగుతున్నది.  చాలా ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు.  కడప జిల్లా వల్లూరు మండలంలో పరిషత్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు.  మాచిరెడ్డిపల్లిలో మొత్తం 420కి పైగా ఓట్లు ఉండగా కేవలం రెండు ఓట్లు మాత్రమే నమోదయ్యాయి.  అదీకూడా వైసీపీ ఎంపిటిసి అభ్యర్దిది ఒక ఓటు కాగా, ఆమె కుమారుడిది మరొక ఓటు.  ఇక దేవరాజ్ పల్లిలోని బూత్ లో ఇప్పటి వరకు 10 ఓట్లు పోలయ్యాయి.  ఇక నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  నెల్లూరు జిల్లా కావలి మండలంలోని తుమ్మలపెంట తీరప్రాంత గ్రామంలోని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఇష్టపడటం లేదని అధికారులు చెప్తున్నారు.