ఏపీ పంచాయతీ ఎన్నికలు: రెండోదశ పోలింగ్ లైవ్ అప్డేట్స్ 

ఏపీ పంచాయతీ ఎన్నికలు: రెండోదశ పోలింగ్ లైవ్ అప్డేట్స్ 
 • రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్.

  02:30 గంటల సమయానికి 76.11 శాతం పోలింగ్.

  అనంతపురం అత్యధిక.. శ్రీకాకుళంలో అత్యల్ప పోలింగ్ నమోదు.

  జిల్లాల వారీ పోలింగ్ వివరాలు..

  శ్రీకాకుళం 69.08  శాతం.

  విజయనగరం 77.30 శాతం.

  విశాఖ 79.81 శాతం.

  తూ.గో 74.97 శాతం.

  ప.గో 75.75 శాతం.

  కృష్ణా 76.56 శాతం.

  గుంటూరు 78.32 శాతం.

  ప్రకాశం 78.53 శాతం.

  నెల్లూరు 72.94 శాతం.

  కర్నూలు 77.91 శాతం.

  కడప 75.17 శాతం.

  అనంత 81.07 శాతం.

  చిత్తూరు 72.06 శాతం.

 • రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్. గడచిన ఆరు గంటల్లో 64.75 శాతం పోలింగ్. విజయనగరం అత్యధిక.. శ్రీకాకుళంలో అత్యల్ప పోలింగ్ నమోదు. 

  జిల్లాల వారీ పోలింగ్ వివరాలు..

  శ్రీకాకుళం 51.30 శాతం.

  విజయనగరం 71.50 శాతం.

  విశాఖ 64.28 శాతం.

  తూ.గో 60.90 శాతం.

  ప.గో 63.54 శాతం.

  కృష్ణా 66.64 శాతం.

  గుంటూరు 67.08 శాతం.

  ప్రకాశం 65.15 శాతం.

  నెల్లూరు 59.92 శాతం.

  కర్నూలు 69.61 శాతం.

  కడప 64.28 శాతం.

  అనంత 70.32 శాతం.

  చిత్తూరు 67.20 శాతం.

 • నెల్లూరు: సీతారామపురం మండలం బాయిలపల్లిలో పోలింగ్ ఆఫీసర్ అత్యుత్సాహం. ఓటరు వద్దకే బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్న ఆఫీసర్. వైసీపీకి చెందిన ఓట్లు కావడంతో ఆఫీసర్ చొరవ చూపుతున్నారని ఆరోపణ. 

 • అమరావతి: ఎస్ఈసి ని కలిసిన టీడీపీ నేతలు. పాతపట్నం ఎల్లంపేటలో బ్యాలెట్ పేపర్లు బయటకొచ్చిన అంశంపై ఫిర్యాదు. మాచర్ల, పుంగనూరు, తంబళ్లపల్లిలో బలవంతపు ఏకగ్రీవాలని ఫిర్యాదు. మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్. మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీకి టీడీపీ సవాల్.  

 • గుంటూరు: నూజెండ్ల మండలం మారెళ్లవారిపాలెంలో ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. ఓటింగ్ కు రాకుండా అడ్డుకుంటున్నారని ఓ వర్గం ఆరోపణ. రోడ్డుపై బైఠాయించి టీడీపీ వర్గీయుల నిరసన. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు. 

 • ప్రకాశం: ఏల్చూరులో ఓటరు లిస్టులో అవకతవకలు. తాత్కాలికంగా పోలింగ్ ను నిలిపివేసిన అధికారులు. 

 • ఏపీలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్. మొదటి నాలుగు గంటల్లో 37శాతానికి పైగా పోలింగ్. విజయనగరంలో 49శాతం, కర్నూలులో 47శాతం, గుంటూరులో 45శాతం, విశాఖలో 40శాతం పోలింగ్ నమోదు.  భారీగా క్యూ కడుతున్న ఓటర్లు.  స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్. 

 • విజయనగరం: కిష్టపల్లిలో టీడీపీ వర్సెస్ వైసీపీ. గుర్తులు చూపి వైసీపీ కార్యకర్తలు ఓటు వెయ్యాలంటున్నారని టీడీపీ ఆరోపణ. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ. 

 • గుంటూరు: ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో ఉద్రిక్తత. ఓటరు స్లిప్ పంపిణి విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య వివాదం. వైసీపీ నేతలు రిగ్గింగ్ కు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆందోళన.  

 • తొలిరెండు గంటల్లో కర్నూలులో అత్యధికంగా పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా చిత్తూరులో పోలింగ్ నమోదైంది.  కర్నూలులో తొలిరెండు గంటల్లో 21శాతం పోలింగ్ నమోదవ్వగా, చిత్తూరులో అత్యల్పంగా 6.13 శాతం పోలింగ్ నమోదైంది.  

 • ఏపీ వ్యాప్తంగా ఉదయం 8:30 గంటల వరకు 10.48శాతం పోలింగ్ నమోదు. అత్యధికంగా కర్నూలులో 21శాతం పోలింగ్ నమోదు. శ్రీకాకుళంలో 10.4 శాతం, విజయనగరంలో 11.6శాతం, విశాఖపట్నంలో 12.4 శాతం, తూర్పుగోదావరిలో 10.67శాతం, పశ్చిమ గోదావరిలో 10.5 శాతం, కృష్ణాలో 6.72శాతం, గుంటూరులో 10శాతం, ప్రకాశంలో 11శాతం, నెల్లూరులో 11.8శాతం, చిత్తూరులో 6.13శాతం, కడపలో 7.05 శాతం, అనంతపురంలో 7.03 శాతం నమోదు. 

 • నెల్లూరు: మర్రిపాడు మండలం నందవరంలో దొంగఓట్లు కలకలం. తన ఓటు ముందే పోల్ అయిపోయిందని బాధితుడు ఆందోళన. ఎన్నికల అధికారి ఫిర్యాదు. 

 • గుంటూరు: నకరికల్లు మండలం నర్సింగపాడులో గుర్తులు తారుమారు. బ్యాలెట్ పేపర్లలో మారిన గుర్తులు. పోలింగ్ నిలిపివేత. 

 • అనంతపురం జిల్లాలో భారీ భద్రతల మధ్య రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.  
 • ఏపీలోని 13 జిల్లాల్లోని 168 మండలాల్లో ఎన్నికలు. తూర్పుగోదావరి జిల్లా కందరాడలో ఇవాళ రీపోలింగ్. 
 • ఏపీలో రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. రెండోదశలో 2,786 పంచాయతీలు, 20,796 వార్డులకు పోలింగ్. రెండోవిడతలో 539 పంచాయతీలు, 12,605 వార్డులు ఏకగ్రీవం. మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు, ఫలితాలు. 
 •