లైవ్ అప్డేట్స్: ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ 

లైవ్ అప్డేట్స్: ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ 
 • విశాఖపట్నం జిల్లా లో  ఎం.పి.టి.సి, జడ్పిటిసి ఎన్నికల  పోలింగ్ మధ్యాహ్నం  1.00 గంటకు  పోలింగ్ శాతం 42.10%

 • అమరావతి

  ఏపీ ఎన్నికల అప్డేట్...

  నరసరావుపేట మం. గోనెపూడిలో తెదేపా శ్రేణుల ఆందోళన

  నరసరావుపేట మం. గోనెపూడిలో తెదేపా శ్రేణుల ఆందోళన

  పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని ఆరోపణ

  పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి తెదేపా నేతల ఆందోళన


  నెల్లూరు

  బ్యాలెట్‌ బాక్సును నీళ్లలో వేసిన భాజపా ఏజెంట్‌

  ఎ.ఎస్‌.పేట మం. పొనుగోడులో తాత్కాలికంగా నిలిచిన ఎన్నికలు

  భాజపా ఏజెంట్‌ బ్యాలెట్‌ బాక్సును నీళ్లలో వేయడంతో నిలిచిన ఎన్నికలు

  అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను తోసేసి బాక్సు ఎత్తుకెళ్లిన ప్రసాద్

  విశాఖ

  అభ్యర్థి గుర్తు మారిందని ఆందోళన

  పెదబయలు మండలం సీతగుంటలో అభ్యర్థి గుర్తు మారిందని ఆందోళన

  బ్యాలెట్ పేపర్‌లో గుర్తు మారిందంటూ ఎంపీటీసీ అభ్యర్థి ఆందోళన

  సీపీఐ అభ్యర్థికి కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి వచ్చిందని ఆందోళన

  వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ

  విజయనగరం

  ద్వారపూడి పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ

  ద్వారపూడిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ

  ఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం

  ఇరువర్గాల మధ్య తోపులాట, చెదరగొడుతున్న పోలీసులు

  ప్రకాశం

  తర్లుపాడు మం. పోతలపాడులో ఏజెంట్ల మధ్య వివాదం

  పోతలపాడులో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌

  పశ్చిమ గోదావరి
   
  కొయ్యలగూడెం మం. అంకాలగూడెంలో తెదేపా అభ్యర్థికి గాయాలు

  రహదారి పక్కన గాయాలతో పడి ఉన్న తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి ఏకుల గడ్డియ్య

  వైకాపా వర్గీయులే దాడిచేశారని ఆరోపిస్తున్న ఏకుల గడ్డియ్య

  కొయ్యలగూడెం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

  అనంతపురం

  ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఉద్రిక్తత

  జనసేన నాయకుడు మధుసూదన్‌ రెడ్డి ఇంటిపై రాళ్లు రువ్విన వైకాపా వర్గీయులు

  వైకాపా వర్గీయుల దాడిలో మధుసూదన్‌ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం

  అనంతపురం: వైకాపా వర్గీయులను చెదరగొట్టిన పోలీసులు

  చిత్తూరు

  ఎన్నికలు బహిష్కరించిన నిండ్ర మం. కీళంబాకం గ్రామస్థులు

  తెదేపా అభ్యర్థులు పోటీలో లేక ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థుల ప్రకటన

  గ్రామస్థులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న ఎన్నికల అధికారులు

  కడప

  బద్వేల్ మం. ఉప్పతివారిపల్లెలో తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి నిరసన

  తెదేపా ఏజెంట్లను బయటకు పంపారంటూ ఆందోళనకు దిగిన భీరం శిరీష

  కడప

  రాజోలు పోలింగ్‌ కేంద్రంలో తెదేపా అభ్యర్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  బ్యాలెట్‌ పేపరు బయటకు తెచ్చారంటూ రాజేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  ప్రకాశం

  చెరుకూరు ఎంపీటీసీ-1 స్థానంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌

  చెరుకూరు ఎంపీటీసీ-1 బ్యాలెట్‌ పత్రాలను వేరే కేంద్రానికి పంపిన అధికారులు

  బ్యాలెట్‌ పేపర్లు లేక తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌

  చిత్తూరు

  ఎన్నికలు బహిష్కరించిన రామకుప్పం మం. రామాపురం తాండా

  పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొనని రామాపురం తాండావాసులు

  తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడంపై అసహనం

  ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరించినట్లు పేర్కొన్న గ్రామస్థులు

  పామూరులో రీపోలింగ్ నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

  ప్రకాశం జిల్లా సీపీఐ కార్యదర్శి అరెస్టును ఖండించిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

  బ్యాలెట్ పేపర్‌లో కంకి కొడవలి గుర్తు మార్చడంపై సీపీఐ ఆందోళన

  సీపీఐ నేతలను అరెస్టు చేయడం అక్రమం: రామకృష్ణ

  పామూరులో రీపోలింగ్ నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

  నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: రామకృష్ణ

  శ్రీకాకుళం

  సంతకవిటి మం. తాలాడ కేంద్రాల్లో ప్రారంభం కాని పోలింగ్

  ఓటరు జాబితాకు ఓటరుకు ఇచ్చిన సిప్పులకు మధ్య వ్యత్యాసంతో గందరగోళం

  తాలాడ పోలింగ్‌ కేంద్రాల్లో తాత్కాలికంగా పోలింగ్‌ నిలిపివేసిన అధికారులు

  అంటిపేట ఎంపీటీసీ స్థానానికి రేపు రీపోలింగ్‌: కలెక్టర్‌

  సీతానగరం మం. అంటిపేట ఎంపీటీసీ స్థానానికి రేపు రీపోలింగ్‌: కలెక్టర్‌

  బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు తప్పుగా నమోదు కావడంతో రీపోలింగ్‌: కలెక్టర్‌

  వైకాపా అభ్యర్థి నిర్మలకు బదులుగా పోటీ నుంచి విరమించిన శనపతి లక్ష్మి పేరు: కలెక్టర్‌

  శనపతి లక్ష్మి పేరు రావడంతో 20, 21, 22 పోలింగ్‌ కేంద్రాల్లో వాయిదా: కలెక్టర్‌

  ప్రకాశం

  పొన్నలూరు మండలం తిమ్మపాలెం ఎంపీటీసీ మృతి

  తిమ్మపాలెం ఎంపీటీసీ షేక్ రజాసాహెబ్ గుండెపోటుతో మృతి

  తిమ్మపాలెం ఎంపీటీసీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన రజాసాహెబ్

  అల్లూరులో ఉపాధ్యాయుడు మృతి

 • అమరావతి

  రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు

  ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ 21.65%

  కర్నూలు జిల్లాలో అత్యధికంగా పోలింగ్
  ప్రకాశం జిల్లాలో అత్యల్ప పోలింగ్

  శ్రీకాకుళం 19.32%

  విజయనగరం 25.68%

  విశాఖపట్నం 24.14 %

  తూర్పుగోదావరి 25 %

  పశ్చిమగోదావరి 23.40%

  కృష్ణ 19.29%

  గుంటూరు 15.85 %

  ప్రకాశం 15.05%

  నెల్లూరు 20.59 %

  కర్నూలు 25.96 %

  అనంతపురం 22.88%

  కడప 19.72%

  చిత్తూరు 24.52%

 • గుంటూరు... పెదకూరపాడు మండలం గారపాడు పోలింగ్ బూత్ వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మద్య ఘర్షణ. రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. అధికారులు, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ.

 • తూర్పుగోదావరి : కాట్రేనికొన (మం) పల్లంకుర్రు, పి.లక్ష్మీవాడ గ్రామాల్లో  కొందరు  యువకుల  అత్యుత్సాహం. ఓట్లు  వేసిన  బ్యాలెట్  పత్రాలు  ఫోటోలు  తీసి  సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసిన  యువకులు. బ్యాలెట్  పత్రాలతో  సెల్ఫీలు దిగి  సోషల్  మీడియాలో  పోస్టింగ్ చేసిన ఓ యువకుడు

 • గుంటూరు... జిల్లాలో 11గంటల వరకు 15.85శాతం పోలింగ్ నమోదు

 • మందకొడిగా పరిషత్ ఎన్నికల పోలింగ్. చాలా ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు. కొన్ని చోట్ల పోలైన ఒకటి రెండు ఓట్లు. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట తీరప్రాంత గ్రామంలో కనిపించని ఓటర్లు. పలుచోట్ల బ్యాలెట్లలో గందరగోళం. 

 • గుంటూరు... దుగ్గిరాల మండలం పెద కొండూరులో అభ్యర్థుల మధ్య గందరగోళ పరిస్థితి,

  పోటీలో లేని సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపరులో  కేటాయింపు, ఆందోళనలో అభ్యర్థులు.

  ఒక చోటే రెండు గుర్తులు కేటాయించడంతో ఓటర్ల ఎక్కడ వేయాలో అర్థంకాని గందరగోళ పరిస్థితి.

 • నెల్లూరు...

  ఏఎస్ పేట(మ)పొనుగోడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

  బిజెపి పార్టీ ఏజేంట్ ప్రసాద్- వైసిపి కార్యకర్త మధ్య ఘర్షణ..

  బ్యాలెట్ బాక్స్ ఎత్తుకొని వెళ్లి నీటి తొట్టిలో వేసిన బిజెపి ఏజెంట్ ప్రసాద్..

  నిలిచిపోయిన పోలింగ్..

  ఓటు వేసేందుకు వచ్చిన వైసిపి కార్యకర్తను అభ్యంతరం పెట్టడంతో చెలరేగిన వివాదం..

 • అమరావతి

  రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు

  మొదటి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ 7.76 %

  కర్నూలు జిల్లాలో అత్యధికంగా పోలింగ్

  తూర్పుగోదావరి  జిల్లాలో అత్యల్ప పోలింగ్


  శ్రీకాకుళం 9%

  విజయనగరం 9.01%

  విశాఖపట్నం 8.83 %

  తూర్పుగోదావరి 4.59%

  పశ్చిమగోదావరి 9.26%

  కృష్ణ 9.22%

  గుంటూరు 7.52%

  ప్రకాశం 6.53%

  నెల్లూరు 6.36%

  కర్నూలు 9.58%

  కడప 4.81%

  చిత్తూరు 8.46%

  అనంతపురం 7.76%

 • గుంటూరు: నరసరావుపేట మండలం పాలపాడులో ఉద్రిక్తత. ఓట్లు వేయకుండా టీడీపీని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు. రోడ్డుపైనే బైఠాయించిన టీడీపీ శ్రేణులు. 

 • గుంటూరు... జిల్లాలో 9గంటలకు 7.52శాతం పోలింగ్ నమోదు.

 • నెల్లూరు: మాముడూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. స్వతంత్ర అభ్యర్థి, ఏజెంట్లపై వైసీపీ నేతల దాడి. తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. 

 • తూర్పు గోదావరి: అమలాపురం మండలంలోని గున్నేపల్లి అగ్రహారంలో బ్యాలెట్ పేపర్ తారుమారు. 51/31 పోలింగ్ కేంద్రంలో తారుమారైన బ్యాలెట్ పేపర్. గాజుగ్లాసు గుర్తు బ్యాలెట్ పేపర్లో లేకపోవడంతో జనసేన అభ్యంతరం. గున్నేపల్లి అగ్రహారంలోని 51/31లో పోలింగ్ కేంద్రంలో ఆగిన పోలింగ్. 

 • కడప జిల్లా

  బద్వేల్ మండలం ఉప్పతివారిపల్లెలో టీడీపీ ఏజెంట్లను బయటకు పంపిన పోలీసులు...

  పోలింగే కేంద్రం వద్దే నిరసనకు దిగిన టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్తి భీరం శిరీషా...

 • కడప జిల్లా

  జిల్లాలో మందకొడిగా సాగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ...

  ఓటింగ్ లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపని ఓటర్లు...

  పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం ఎదురు చూస్తున్న  ఎన్నికల సిబ్బంది...

 • గుంటూరు... పిట్టలవానిపాలెం మండలం అల్లూరులో ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు గుండెపోటుతో మృతి

 • నెల్లూరు :  జిల్లాలో మొత్తం జెడ్పీటీసీలు... 46

  12 జడ్పీటీసీలు అధికార పార్టీ ఏకగ్రీవం..

  ఎన్నికలు జరగాల్సిన జెడ్పీటీసీలు ...34 

  పోటీలో ఉన్న  జెడ్పీటీసీ అభ్యర్థులు..140


  మొత్తం ఎంపీటీసీలు... 554 

  ఏకగ్రీవమైన ఎంపీటీసీలు...188

  ఎన్నికలు జరగాల్సిన ఎంపీటీసీలు...366

  పోటీలో  ఉన్న మొత్తం ఎంపీటీసీలు...972

  ఇప్పటికే మరణించిన ఎంపీటీసీలు..06 


  మొత్తం ఓటర్లు ...13, 12, 915 

  మొత్తం పోలింగ్ స్టేషన్లు ..1983

 • చిత్తూరు 

  మొత్తం జడ్పీటీసీ స్థానాలు..65
  ఏకగ్రీవం అయినవి..30 వైకాపా
  కలకడలో రెండు చోట్ల అభ్యర్ధుల మృతి..
  ఎన్నికలు జరుగు జడ్పీటీసీ లు..33


  మొత్తం ఎంపీటీసి స్థానాలు..886
  ఎంపీటీసీ ఏకగ్రీవాలు -433

  వ్తెసీపీ - 323
  టిడిపి - 19
  జనసేన-01
  ఇతరులు-04

  ఎన్నికలు జరుగు ఎంపీటీసీ స్థానాలు..419

 • విశాఖ 

  *మెుత్తం ఎంటీసీలు 651*

  ఎకగ్రీవం అయినవి 37
  (వైసీపీ 36, ఇండిపెండెంట్ 1)

  మరణించిన వారు 2

  పోలింగ్ జరిగేవి 612

  బరిలో ఉన్నా అభ్యర్థులు 1,793

  *మెుత్తం జెడ్సిటిసీలు 39*

  ఎకగ్రీవం 1(వైసీపీ)

  మరణించనవారు 1

  పోలింగ్ జరిగేవి 37

  బరిలో ఉన్న అభ్యర్థులు 176 మంది....

  మొత్తం 2100 పోలింగ్ కేంద్రాలు

  మొత్తం ఓటర్లు 17,84,678

  పురుష ఓటర్లు 8,76,061

   మహిళా ఓటర్లు 9,08,546

   ఇతర ఓటర్లు 71

  మొత్తం ఎన్నికల సిబ్బంది 12,606

 • కడప జిల్లా

  జిల్లాలో ప్రారంభమైన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు..

  జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు : 50

  ఏకగ్రీవం అయిన స్థానాలు : 38

  ఎన్నికలు జరుగుతున్న జడ్పీటీసీ స్థానాలు : 12

  మొత్తం ఎంపిటీసీ స్థానాలు : 554

  ఎన్నికలు వాయిదా పడిన స్థానాలు : 5

  ఏకగ్రీవమైన స్థానాలు : 432 

  ఎన్నికలు జరుగుతున్న ఎంపీటీసీ స్థానాలు : 117

 • అనంతపురం : 

  జిల్లాలో 63 జడ్పీటీసీ , 841 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.

  ఎంపీటీసీ ఏకగ్రీవాలు - 50.
  వ్తెసీపీ - 49.
  టిడిపి - 01.

  చిలమత్తూరు వ్తెసీపీ అభ్యర్థి మృతితో 62 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు.

  ఎంపీటీసీ స్థానాలలో బరిలో నిలిచిన 9 మంది వివిధ పార్టీల అభ్యర్థుల  మృతి.

  782 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.

  జిల్లా వ్యాప్తంగా 2,665 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.

  అత్యంత సమస్యాత్మకమ్తెన కేంద్రాలుగా 970 గుర్తింపు.

  ఒక జడ్పీటీసీ , 10 ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికలు వాయిదా.

 • గుంటూరు... రాజపాలెం మండలం రెడ్డిగూడెం ఎస్టీ కాలనిలో అర్ధరాత్రి  ఘర్షణ.

  ఒకే సామాజిక  వర్గానికి చెందిన ఇరువర్గాలు దాడులకు తెగబడ్డ వైనం


  జడ్పీటీసీ ,ఎంపీటీసీ. ఎన్నికల్లో నగదు పంపిణీ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ


  ఆధిపత్యం పోరుతో ఒక వర్గంపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసిన మరో వర్గం

  ఐదుగురు వ్యక్తులకు గాయాలు

  సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

 • గుంటూరు... మొత్తం జడ్పీటీసీ స్థానాలు 54

  ఏకగ్రీవాలు 9.

  అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నిలు నిలిచిపోయిన స్థానాలు 1

  ఎన్నికలు జరుగుతున్న స్థానాలు 44

  పోటీలో ఉన్న అభ్యర్దులు 191.


  మొత్తం ఎంపీటీసీ స్థానాలు 805

  ఏకగ్రీవాలు 226

  అభ్యర్దులు చనిపోవడంతో ఎన్నికలు నిలిచిపోయిన స్థానాలు 8.


  ఎన్నికలు జరుగుతున్న స్థానాలు 571.

  పోటీలో ఉన్న అభ్యర్దులు 1476.

 • ప్రకాశం : 
  జిల్లాలో ఇవాళ పరిషత్ ఎన్నికలు. 

  ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్. 

  జిల్లాలో బ్యాంకులు, స్కుల్స్ కి సెలవు ప్రకటించిన కలెక్టర్ పోలా భాస్కర్. 

  జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు : 56

  కోర్టు కేసుల కారణంగా వాయిదా : 01

  నోటిఫికేషన్ ఇచ్చిన జడ్పీ స్థానాలు : 55

  ఏకగ్రీవం : 14(వైసీపీ)

  ఎన్నికలు జరుగుతున్న జడ్పీటీసీ స్థానాలు : 41

  పోటీలో ఉన్న అభ్యర్థులు : 154


  ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న మండలాలు : 53

  ఎన్నికలు వాయిదాపడిన మండలాలు : 03

  మొత్తం ఎంపిటీసీ స్థానాలు : 784

  ఎన్నికలు వాయిదా పడిన స్థానాలు : 63

  మరణించిన ఎంపిటీసీ అభ్యర్థులు : 06

  ఏకగ్రీవమైన స్థానాలు : 348
  వైసీపీ : 315
  టీడీపీ : 33

  ఎన్నికలు జరుగుతున్న ఎంపీటీసీ స్థానాలు : 367

  పోటీలో ఉన్న అభ్యర్థులు : 988

  పోలింగ్ కేంద్రాలు : 2,194 

  మొత్తం ఓటర్లు : 17,27,371

 • తూర్పుగోదావరి జిల్లా   :


  నేడు  జిల్లాలో 61 జెడ్.పి.టి.సి స్థానాలు... వెయ్యి 
  ఎం.పి.టి.సి. స్థానాలకు ఎన్నికల  పోలింగ్ 


  ఉదయం  7 గంటల నుండి  సాయంత్రం  5 గంటల వరకు పోలింగ్ 

  తూర్పు  మన్యంలో  ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం  3 గంటల వరకు 

  మావోయిస్టుల ప్రభావిత
  ప్రాంతాలు కారణంగా  రెండు గంటల  సమయం కుదింపు


  32 లక్షల మంది పరిషత్ ఎన్నికల్లో   ఓటు వేయాల్సి  ఉండగా... 3వేల561 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు 


   ఎన్నికల విధుల్లో సుమారు 21వేల మంది సిబ్బంది 

  61 జెడ్.పి.టి.సి.  స్థానాలకు  235 మంది అభ్యర్థులు పోటీ 


  వెయ్యి  ఎం.పి.టి.సి.  స్థానాలకు  2622 మంది అభ్యర్థులు పోటీ 

  పోలింగ్ కేంద్రాల వద్ద  144 సెక్షన్ అమలు

 • శ్రీకాకుళం ------

  నేడు శ్రీకాకుళం జిల్లాలో పరిషత్ ఎన్నికలు 

  మొత్తం జడ్పీటీసీలు - 38 , ఎంపీటీసీలు - 678

  అభ్యర్ధులు చనిపోవడంతో ఎన్నికలు వాయిదా పడిన జడ్పీటీసీ - 1 ( హిరమండలం (మం) , ఎంపీటీసీలు - 11 

  విలీన వివాదంతో ఎన్నికలు వాయిదా పడిన ఎంపీటీసీలు - 11

  ఏకగ్రీవమైన ఎంపీటీసీలు - 66 ( వైసీపీ ) 

  ఎన్నికలు జరగనున్న జడ్పీటీసీలు - 37 , ఎంపీటీసీలు - 590

 • పశ్చిమ గోదావరి..

  మొత్తం జడ్పీటీసీ స్థానాలు..48

  ఏకగ్రీవం అయినవి..02(Ycp)

  జడ్పీటీసీ బరిలో నిలిచిన ఒక అభ్యర్థి మృతి చెందటంతో..

  ఎన్నికలు జరుగు జడ్పీటీసీ లు..45


  మొత్తం ఎంపీటీసి స్థానాలు..863.


  ఎంపీటీసీ ఏకగ్రీవాలు -73

  వ్తెసీపీ - 65
  టిడిపి - 03
  జనసేన-01
  ఇతరులు-04

  ఎన్నికలు జరుగు ఎంపీటీసీ స్థానాలు..781

  ఎంపీటీసీ బరిలో నిలిచిన 9 మంది వివిధ పార్టీల అభ్యర్థుల  మృతి.

  మొత్తం పోలింగ్ కేంద్రాలు..2,876 ఏర్పాటు.

  ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్...

 • విజయనగరం జిల్లా 

  మండలాలు 34


  మొత్తం జెడ్పిటిసి స్థానాలు- 34

  ఏకగ్రీవమైన జెడ్పిటిసి లు - 3 (వైసీపీ)

  ( మెరకముడిదాం, దత్తి  రాజేరు, సీతానగరం) 

  ఎన్నికలు జరిగే స్థానాలు - 31

  బరిలో ఉన్న మొత్తం అభ్యర్థులు - 129


  మొత్తం ఎంపిటిసి స్థానాలు- 549

  ఏకగ్రీవమైన ఎంపిటీసి స్థానాలు - 55

  వైసీపీ(53), ఇండిపెండెంట్ (2)

  ఎన్నికలు  కి వెల్లే ఏంపిటిసిలు - 494

  ఎనిమిది మంది ఎంపిటిసి అభ్యర్థులు మృతి


  ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఏడుగురు పోటీ చేసిన వారు...ఒకరు ఏకగ్రీవం అయిన వ్యక్తి మృతి

  ఎన్నికలు జరగనున్న స్థానాలు..487

 • కర్నూలు :  

  జిల్లాలో మొత్తం జెడ్పీటీసీలు... 53

  16 జడ్పీటీసీలు అధికార పార్టీ ఏకగ్రీవం..(ఒకరు మృతి)

  ఎన్నికలు జరగాల్సిన జెడ్పీటీసీలు ...37

  అభ్యర్థి మృతి కారణంగా 1 జడ్పీటీసీ ఎన్నిక వాయిదా

  ఎన్నికలు జరగనున్న జడ్పీటీసీ లు 36

  పోటీలో ఉన్న  జెడ్పీటీసీ అభ్యర్థులు..146

  మొత్తం ఎంపీటీసీలు... 807

  ఏకగ్రీవమైన ఎంపీటీసీలు...312

  ఎన్నికలు జరగాల్సిన ఎంపీటీసీలు...483

  పోటీలో  ఉన్న మొత్తం ఎంపీటీసీలు...1308

  ఇప్పటికే మరణించిన ఎంపీటీసీలు..9

  ఆదోని మున్సిపాలిటీ లో విలీనం కారణంగా ఎన్నికలు జరగని  ఎంపీటీసీలు 3

 • శ్రీకాకుళం------ 
 • రణస్థలం (మం) బంటుపల్లిలో బీజేపీ , వైసీపీ ఘర్షణ 
 • వీధిలైట్లు ఆపేసి వైసీపీ శ్రేణుల ఇళ్ల పై దాడులకు పాల్పడిన బీజేపీ శ్రేణులు 
 • పాతకక్షల నేపధ్యంలో దాడులకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు 
 • బీజేపీ దాడుల్లో నలుగురికి తీవ్రంగా ,6 గురికి స్వల్ప గాయాలు 
 • గాయాల పాలైన వారు రిమ్స్ కు తరలింపు 
 • బంటుపల్లిలో పరిస్థితి ఉధ్రిక్తం 
 • మరోమారు ఘర్షణ చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు