స్వర్ణ ప్యాలెస్‌ బాధితులకు పరిహారం అందజేత

స్వర్ణ ప్యాలెస్‌ బాధితులకు పరిహారం అందజేత

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికం సాయం అందజేసింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.. ఈ ఘటనపై సీఎం జగన్ మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు అనుమతుల్లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొవిడ్‌కేర్‌ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.