ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై ప్రివిలేజ్‌ నోటీసు..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై ప్రివిలేజ్‌ నోటీసు..

పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు తలనొప్పిగా మారింది.. వరుసగా సీఎస్‌ ఆదిత్యానాథ్‌ దాస్‌కు లేఖలు రాస్తూ వస్తున్న నిమ్మగడ్డ... గవర్నర్‌కు కూడా లేఖ రాయడాన్ని మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్ఈసీ నిమ్మగడ్డ వైఖరిని తప్పుబట్టారు.. మంత్రినైన తన పై నిరాధార ఆరోపణలు చేశారని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.. దురుద్ధేశాలతో గవర్నర్ కు తన పై ఫిర్యాదు చేయటం తన హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు లేఖరాసినట్టు వెల్లడించారు. 

ఇక, గవర్నర్‌తో నియమించ
బడ్డ వ్యక్తి ఆయనకు లేఖలు రాయడం ఏంటి...? అని మండిపడ్డారు మంత్రి బొత్స.. ఆయన వక్రబుద్ధి బయటపడుతోందన్న బొత్స.. నిమ్మగడ్డపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చాం... చర్యలు తీసుకోమని, మా హక్కులను కాపాడమని స్పీకర్ ను కోరాం.. బెదిరింపులకు పాల్పడుతున్నారనే నిరాధారమైన ఫిర్యాదులు చేస్తున్నారు... ఏకగ్రీవాల స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. కడపకు నిమ్మగడ్డ వెళ్ళింది... ఎన్నికలు సమీక్షించడానికా..? హరికథ చెప్పడానికా...! అంటూ ఎద్దేవా చేసిన బొత్స.. ఎంత మంది దుష్టశక్తులు కలిసినా 99శాతం విజయం వైసీపీదేనని.. అది ప్రజలు ఇవ్వబోయే తీర్పు అని ధీమా వ్యక్తం చేశారు.