రాజధానికి పెట్టి అమరావతి పేరు చెడగొట్టారు.. మంత్రి ఫైర్‌

రాజధానికి పెట్టి అమరావతి పేరు చెడగొట్టారు.. మంత్రి ఫైర్‌

అమరావతి పేరును రాజధానికి పెట్టి ఆ పేరును చెడగొట్టారని మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రస్తుతం అమరావతి రాజకీయ ఎత్తుగడలకు వేదికగా మారిందని, తానే అమరావతికి పేరు తెచ్చినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. ధ్యాన బుద్ధ విగ్రహంపై చంద్రబాబుకు పేటెంట్ లేదన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళనలను నడిపిస్తారో చూస్తామని వ్యాఖ్యానించారు మంత్రి.. ఇక, టీడీపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇంకా ఎన్ని రోజులు పెయిడ్ ఆందోళనలు నడిపిస్తారు? అంటూ మండిపడ్డారు.. మరోవైపు, పెయిడ్ దీక్షలకు కమ్యూనిస్టులు మద్దతు తెలపడం దారుణమన్నారు. రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే సీఎంకు రిప్రజెంటేషన్‌ ఇవ్వాలన్నారు.