అక్రమ మద్యం వెనుక చంద్రబాబు హస్తం..! స్మగ్లింగులో 80 శాతం టీడీపీవారే..!

 అక్రమ మద్యం వెనుక చంద్రబాబు హస్తం..! స్మగ్లింగులో 80 శాతం టీడీపీవారే..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి... ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తరలింపు వెనుక చంద్రబాబు హస్తం ఉందని మేం భావిస్తున్నామన్న ఆయన.. 80 శాతం లిక్కర్‌ స్మగ్లింగు టీడీపీకి చెందినవారే చేస్తున్నారని వ్యాఖ్యానించారు... డ్రైవర్లు, క్లీనర్లపై కాకుండా స్మగ్లింగ్ చేస్తున్న వాహన యజమానిపై కేసులు పెట్టాలని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఏ పార్టీ నాయకులు వీటి వెనుక ఉన్నా సహించేది లేదని స్పష్టం చేసిన ఎక్సైజ్ మంత్రి.. మద్యపాన నిషేధం కావాలా..? వద్దా..? అనేది చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు.. మద్యం దుకాణాల రెంట్ పై రూ. 108 కోట్లు ఆదా చేశామని తెలిపారు మంత్రి నారాయణస్వామి... రివర్స్ టెండరింగ్ ద్వారా గత ఏడాది అద్దెలతో పోలిస్తే రూ. 108 కోట్లు ఆదాచేసినట్టు చెప్పుకొచ్చారు.. ఇక, సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తున్నామని స్పష్టం చేసిన ఆయన.. గతంలో మద్యం షాపులు రెంటుకు తీసుకున్నాం.. అధిక రెంట్లకు షాపులు తీసుకున్నారు అని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాం.. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 108.84 కోట్లు ఆదా అయ్యిందన్నారు. 2019-20 లో షాపులకు రూ. 671.04 కోట్ల రెంటు చెలిస్తే.. అదే రివర్స్ టెండరింగ్ ద్వారా 2020-21కి కేవలం రూ. 562.2 కోట్లు చెల్లిస్తున్నట్టు తెలిపారు మంత్రి.. దాదాపు 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశామని.. మద్యపానం తగ్గించడం వల్ల నేరాలు, ప్రమాదాలు తగ్గాయన్నారు.