కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. అమరావతిలో అది కూడా వద్దు..!

కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. అమరావతిలో అది కూడా వద్దు..!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు పూనుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. అయితే, ఈ తరుణంలో ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దంటూ వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని.. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక, అన్ని పక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుందామన్నారు మంత్రి కొడాలి నాని. దీనిపై వారం రోజుల క్రితమే స్పందించిన మంత్రి... సోమవారం రోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మూడు రాజధానుల వ్యవహారంపై ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు చంద్రబాబుకు ఎమ్మెల్యేల బలం లేదన్నారు మంత్రి కొడాలి నాని.. ఉన్నవాళ్లు కూడా జారిపోతున్నారు అని వ్యాఖ్యానించారు. మరోసారి మాజీ మంత్రి లోకేష్‌ను టార్గెట్ చేసిన కొడాలి నాని... లోకేష్‌ను ఎమ్మెల్యేను చేయడం ఎవరి వల్లా కాదు అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ గ్రీన్ కార్పొరేషన్ రూ. 30 వేల కోట్లతో తెస్తున్నాం మని ప్రకటించిన మంత్రి.. పేదలకు ఇళ్ల పట్టాలిద్దామంటే కోర్టుకు వెళ్లి స్టే తేవడం విడ్డూరం అంటూ విపక్షాలపై మండిపడ్డారు. ఇక, తన ప్రకటనలో.. అమరావతిలో శాసన రాజధాని వద్దనే తన అభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఓవైపు.. రాజధానుల వ్యవహారంపై వివాదం కొనసాగుతూనే ఉండగా... ఇప్పుడు కొడాలి నాని స్టేట్‌మెంట్‌ కొత్త చర్చకు తెరలేపింది.. మరి దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది... ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి? అనేది ఆసక్తిగా మారింది.