పవన్‌పై మరోసారి కొడాలి ఫైర్.. మరింత ఘాటుగా..!

పవన్‌పై మరోసారి కొడాలి ఫైర్.. మరింత ఘాటుగా..!

పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది.. జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఏపీ మంత్రులు... నిన్నటికి నిన్న పవన్ కల్యాణ్‌పై ఒంటికాలితో లేచిన మంత్రి కొడాలి నాని.. ఇవాళ మరోసారి పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు... పవన్ కల్యాణ్ ఏమనుకున్నా డోంట్ కేర్ అంటూనే.. తంతే పవన్ వెళ్లి పక్కదేశంలో పడతాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భయపడడానికి ఇది సినిమా కాదు అంటూ వార్నింగ్ ఇచ్చిన కొడాలి... చంద్రబాబుకు ఆపద వస్తే పవన్ వచ్చేస్తాడని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు, పవన్ కలిసినా ఏం చేయలేరు అని కామెంట్ చేసిన ఆయన.. తన కోసం తప్ప పవన్ రైతుల గురించి మాట్లాడడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు స్ర్కిప్ట్ ఇస్తే పవన్ చదువుతున్నాడని విమర్శించిన ఆయన.. ప్యాకేజీ తీసుకుని పవన్ మాట్లాడతాడు అంటూ ఆరోపించారు. ఇక, పవన్ వార్నింగ్‌లు ఇవ్వడమేంటి? అంటే ప్రశ్నించిన కొడాలి... భయపడేది లేదు.. సీఎం వైఎస్‌ జగన్‌ను ఒక్క మాట అంటే మేం పది అంటాం అంటూ హెచ్చరించారు.. నోటికి వచ్చినట్లు పవన్ కల్యాణ్ మాట్లాడొద్దు అంటూ హితవు పలికారు.