లోకేష్‌కి వరి చేనుకి.. చేపల చెరువుకి తేడా తెలియదు..!

లోకేష్‌కి వరి చేనుకి.. చేపల చెరువుకి తేడా తెలియదు..!

రాజధాని ప్రాంతంలో రైతులకు బేడీలు వేయడంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది... రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికి తప్పేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా.. మరోవైపు.. టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు.. ఇవాళ నారా లోకేష్‌, దేవినేని ఉమను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు మంత్రి కొడాలి నాని... నారా లోకేష్‌కు వరి చేనుకి.. చేపల చెరువుకి తేడా తెలియదు అంటూ ఎద్దేవా చేసిన కొడాలి... అతనో వేస్ట్‌ ఫెలో అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు.. ఇక, లోకేష్‌ ఎంత తిరిగినా ఉపయోగంలేదన్న ఆయన.. అమరావతిలో ఉన్న రైతులు మాత్రమే రైతులు కాదు.. అమరావతిలో భూములు కొన్నారు కాబట్టే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమ.. చేతులకు బేడీలు వేసుకోవడంపై స్పందించిన మంత్రి కొడాలి... రైతులకు బేడీలు వేశారని తాను కూడా బేడీలు వేసుకున్న దేవినేని ఉమ... బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ.. తనను తాను గన్‌తో కాల్చుకోవాలి అంటూ కామెంట్ చేశారు.. అసలు పోలవరం ఇబ్బందులకు దేవినేని ఉమానే కారణం అంటూ ఆరోపించారు.