సోమువీర్రాజు మాటలు వాళ్ల పార్టీ కార్యకర్తలే పట్టించుకోరు.. కొడాలి సెటైర్లు

సోమువీర్రాజు మాటలు వాళ్ల పార్టీ కార్యకర్తలే పట్టించుకోరు.. కొడాలి సెటైర్లు

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై సెటైర్లు వేశారు మంత్రి కొడాలి నాని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ వ్యవహారంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సోము వీర్రాజు మాటలను ఆ పార్టీ కార్యకర్తలే పట్టించుకోరని ఎద్దేవా చేశారు.. సోము వీర్రాజు మా మీద ఆరోపణలు చేసే బదులు కేంద్రంతో ఒక్క స్టేట్‌మెంట్‌ ఇప్పించాలని డిమాండ్ చేసిన కొడాలి.. తెలియని ఓ మంత్రి ట్వీట్ చేశారు... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించటం లేదని... కేంద్రంతో సోము వీర్రాజు చెప్పించాలని కోరారు కొడాలి. కాగా.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోమువీర్రాజు.. ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ, టీడీపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వం టీడీపీతో చేతులు కలిపి బీజేపీని ఏకాకిని చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడుల అంశం నుంచి దృష్టి మరల్చేందుకే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని టీడీపీ, వైసీపీ తెరపైకి తెచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక, స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని.. స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర మంత్రి ఒక్క ప్రకటన చేయలేదని.. ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు, మరి ఉద్యమం ఎందుకు ? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కాడాలి నాని.. సోము వీర్రాజుకు కౌంటర్ ఇచ్చారు.