జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా టీడీపీని కాపాడ‌లేడు..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా టీడీపీని కాపాడ‌లేడు..!

ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న ప‌రిస్థితుల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఏమీ చేయ‌లేరంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని... తెలుగుదేశం పార్టీలో ఉన్న స‌మ‌యంలో నంద‌మూరి హ‌రికృష్ణ ఫ్యామిలీతో.. ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఎంతో స‌న్నిహితంగా మెలిగిన కొడాలి నాని.. ఆ త‌ర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత.. మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చే కొడాలి నాని.. తాజాగా ఎన్టీవీ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. 

నేను టీడీపీలో ఉన్న స‌మ‌యంలో నంద‌మూరి హ‌రికృష్ణ‌, ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబ‌ర్స్, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ట్రావెల్ అవుతూ వ‌చ్చామ‌న్నారు కొడాలి నాని.. అయితే, 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయిన త‌ర్వాత హ‌రికృష్ణ‌ను ప‌క్క‌న‌బెట్ట‌డం, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాడుకొని వ‌దిలేయ‌డంతో... ఎప్ప‌టికైనా టీడీపీలో త‌న‌కు మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని భావించి.. వైసీపీలో చేరానున్నారు. ఇక‌, టీడీపీకి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింద‌న్న కొడాలి నాని.. ఇప్పుడు ఎవ్వ‌రూ వ‌చ్చినా టీడీపీని కాపాడే శ‌క్తి లేద‌ని.. జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చినా క‌ష్ట‌మేన‌ని.. ఎందుకంటే.. తెలంగాణ‌లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది... ఏపీలో స‌రైన పోటీ ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంద‌న్నారు... ఈ సంద‌ర్భంగా ఎన్టీవీ ఇంట‌ర్వ్యూలో కొడాలి నాని చేసిన ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌ల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి...