పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి ఫైర్.. ఇప్పటికైనా తీరు మార్చుకో..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి కన్నబాబు.. కాపు నేస్తంపై పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఆ పథకంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కాపులను మోసం చేసిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసిన కన్నబాబు.. కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయలేకపోతున్నారంటూ జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక, తమ ప్రభుత్వం కాపులకు అండగా ఉందన్న మంత్రి కన్నాబాబు.. కాపు నేస్తం కింద మహిళలకు ఆర్థిక సాయం చేశాం.. ఏడాది కాలంలో రూ.4,769 కోట్ల సాయం అందించాం.. ప్రభుత్వం మంచిచేస్తుంటే.. పవన్‌కు ఎందుకంత ఉక్రోషం అంటూ మండిపడ్డారు.. ఓర్వలేనితనంతోనే అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కాపుల కోసం గతంలో ముద్రగడ ఉద్యమం చేస్తే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు అణచివేశారు.. ఉద్యమంలో పాల్గొన్నవారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.. మరి అప్పుడు పవన్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు.. ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేయడంపై మండిపడ్డ కన్నబాబు.. ఇప్పటికైనా పవన్ తన తీరును మార్చుకోవాలని కౌంటర్ ఇచ్చారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)