ఈ రాత్రికి ఆ ఐదు గ్రామాల్లో మంత్రుల బస..

ఈ రాత్రికి ఆ ఐదు గ్రామాల్లో మంత్రుల బస..

ఇవాళ రాత్రికి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రభావిత ఐదు గ్రామాల్లో మంత్రుల బృందం బసచేయనున్నట్టు తెలిపారు మంత్రి కన్నబాబు... ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం పంపిణీలో భాగంగా కేజీహెచ్‌లో చిన్నారి గ్రీష్మ తల్లికి రూ.కోటి చెక్కును మంత్రులు బొత్స, అవంతి, ధర్మానతో కలిసి అందజేసిన కన్నబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూర్తిగా కోలుకున్నవారిని మాత్రమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నామని.. డిశ్చార్జ్ చేసిన వాళ్లకు పరిహారం వెంటనే అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని వాలంటీర్లతో బాధితులందిరికీ ఇస్తామన్న ఆయన.. ఈ పరిమారం కోసం.. మీరు ఏ అధికారి వద్దకూ వెళ్లొద్దు.. వాలంటీరే మీ ఇంటికి వచ్చి పరిహారం అందజేస్తారని వెల్లడించారు. ఇక, ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో శానిటైజ్ చేస్తున్నాం.. ప్రతీ ఇంటిని శానిటైజ్ చేయాలని సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారని తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ఐదు గ్రామాల ప్రజలను సంబంధిత గ్రామాల్లోకి అనుమతిస్తాం... ఇక, వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి ఈ రాత్రి ఆ ఐదు గ్రామాల్లో మంత్రుల బృందం బస చేస్తుందన్నారు మంత్రి కన్నబాబు.