'ఒకరిద్దరు పార్టీ మారితే ఒరిగేదేమీ లేదు..'

'ఒకరిద్దరు పార్టీ మారితే ఒరిగేదేమీ లేదు..'

ఒకరిద్దరు పార్టీ మారితే ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు మంత్రి కళా వెంకట్రావ్... శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ మారుతోన్న నేతలపై ఘాటుగా స్పందించారు. కొంత మంది టిక్కెట్లు వస్తాయో? రావో? అనే అనుమానాలు, జనం మధ్య తిరగలేకే పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. పార్టీని వీడేవారి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదన్న మంత్రి.. పార్టీలు మారుతున్న నేతలు మాటలు అదుపులో పెట్టుకుంటే మంచిదని... లేకపోతే ప్రజలు ఆ నాయకుల మాటలను సహించబోరని హెచ్చరించారు. ఐదేళ్లపాటు పొగిడిన నోటితోనే పార్టీమారిన తర్వాత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కళా వెంకట్రావ్.. రాజకీయాలపై అవగాహన లేనివారే అలా మాట్లాడుతారని.. చంద్రబాబు సేవలు మరో ఐదేళ్లు వినియోగించుకోవాలనే ప్రజలు చూస్తున్నారన్నారు.