పరిపక్వత లేకే వలసలు..!

పరిపక్వత లేకే వలసలు..!

పార్టీ మారుతున్న నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కళా వెంకట్రావు... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... పార్టీ మారే వాళ్లంతా రాజకీయ పరిపక్వత లేనివారే అంటూ మండిపడ్డారు. రాజకీయాల కోసమే పార్టీ మారుతున్నారు తప్ప.. ప్రజాప్రయోజనాలు వారికి పట్టవని ఆగ్రహం వ్యక్తం చేసిన కళా వెంకట్రావ్.. పరిపక్వత లేని వారి గురించి స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయం కోసం చంద్రబాబు పై అవాకులు చవాకులు పేలుతున్నారు.