ఆసక్తిగా మారిన మంత్రి అవంతి వ్యాఖ్యలు.. గంటాతో ఆ మాట చెప్పించగలరా..?

ఆసక్తిగా మారిన మంత్రి అవంతి వ్యాఖ్యలు.. గంటాతో ఆ మాట చెప్పించగలరా..?

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి నారా లోకేష్ కారణం కాదా? అని ప్రశ్నించిన అవంతి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు, లోకేష్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. పార్టీని భ్రష్టు పట్టించింది లోకేష్ కాదా..? అని వ్యాఖ్యానించారు. ఇక, నారా లోకేష్ వల్లే టీడీపీ పూర్తిగా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు అవంతి.. ఎన్నికల్లో ఓడిపోయారనే కారణాలతో టీడీపీ అధ్యక్ష పదవి నుంచి కళా వెంకట్రావుని మార్చాలని చూస్తున్నారని ఆరోపించిన అవంతి... మరి లోకేష్ కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోకుండా.. పదవిలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ఇక, నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి టీడీపీ నేతలు సిద్ధంగా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.. లోకేష్ నాయకత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యేల్లో‌ ఒక్కరైనా ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించిన మంత్రి అవంతి.. ఆ మాట గంటా శ్రీనివాసరావుతో చెప్పించగలరా? అంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై రకరకాల పుకార్లు షికారు చేశాయి.. ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే గుసగుసలు వినిపించాయ.. ఆ తర్వాత అధికార వైసీపీ వైపు చూస్తున్నారనే పుకార్లు కూడా వచ్చాయి.. ఈ నేపథ్యంలో మంత్రి అవంతి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారియి.