టూరిస్ట్ బోట్లకు లైసెన్స్‌లపై టూరిజం శాఖ ఫోకస్..!

టూరిస్ట్ బోట్లకు లైసెన్స్‌లపై టూరిజం శాఖ ఫోకస్..!

టూరిజం బోట్ల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు.. టూరిస్ట్ బోట్ల లైసెన్సుల అంశంపై ఏపీ టూరిజం శాఖ ఫోకస్ పెట్టింది.. టూరిజం బోట్లు ఆపరేట్ చేయడానికి.. రూట్ పర్మిషన్లను ఇరిగేషన్ శాఖ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు.. ఇక, అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అవంతి శ్రీనివాస్.. మొత్తంగా 300 బోట్లు ఉన్నాయని.. ఈ బోట్లను చాలా వరకు తనిఖీలు చేసినట్టు తెలిపారు. అన్ని రకాల తనిఖీలు పూర్తయ్యాక పోర్ట్ అథార్టీ అధికారి బోట్లను సర్టిఫై చేస్తారన్న మంత్రి.. సరంగులకు ట్రైనింగ్ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణులయ్యే వారికే లైసెన్సులు ఇస్తామని స్పష్టం చేశారు. కాకినాడ పోర్ట్ అధికారి వచ్చే నెల 10వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపిన మంత్రి.. బోటింగుకు సంబంధించి మొత్తంగా 9 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. ఇరిగేషన్, టూరిజం, పోలీస్, రెవెన్యూ, విపత్తు నిర్వాహణ శాఖల అధికారులు ఈ కంట్రోల్ రూమ్‌లలో ఉంటారని వెల్లడించారు.