చంద్రబాబు ముందు ఆ నివేదిక తగలబెట్టు..

చంద్రబాబు ముందు ఆ నివేదిక తగలబెట్టు..

అమరావతి రైతులకు జరుగుతోన్న అన్యాయంపై ఆందోళనలు కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. భోగి సందర్భంగా ఉదయం బెజవాడ బెంచ్ సర్కిల్‌లో నిరసన వ్యక్తం చేసిన ఆయన.. జీఎన్‌ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు... అయితే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్... విశాఖ మురళినగర్‌లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి అవంతి.. రాష్ట్రంలో ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇక, తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకు భవిష్యత్ లేదని జోస్యం చెప్పిన ఆయన.. చంద్రబాబు ముందు నారాయణ కమిటీ నివేదికను తగలబెట్టాలి.. తర్వాతే మిగతా వాటి గురించి ఆలోచించాలని సూచించారు.