ఏపీ మంత్రి సవాల్.. గజం స్థలం కబ్జా చేసినట్టు నిరూపించినా రాజీనామా..

ఏపీ మంత్రి సవాల్.. గజం స్థలం కబ్జా చేసినట్టు నిరూపించినా రాజీనామా..

తెలుగుదేశం పార్టీ నేతలకు సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను గజం స్థలమైనా కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు.. టీడీపీ మహానాడులో చంద్రబాబు మాటలు గురివింద సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేసిన మంత్రి అవంతి... గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిందో మహానాడులో సమీక్ష చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా.. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేయడం మాని... రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు సహకరించాలని కోరారు మంత్రి అవంతి శ్రీనివాసరావు.