వదంతులు నమ్మొద్దు.. ఐదు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం

వదంతులు నమ్మొద్దు.. ఐదు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను దయచేసి నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇక, ఇవాళ ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం పంపిణీని ప్రారంభించారు మంత్రులు.. కేజీహెచ్‌లో చిన్నారి గ్రీష్మ తల్లికి రూ.కోటి చెక్కును అందజేశారు మంత్రులు.. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి, బొత్స, కన్నబాబు, ధర్మాన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు.. ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉందన్న ఆయన.. మొత్తం ఐదు గ్రామాలను క్లీన్ చేస్తున్నాం.. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత స్థానికులను ఆయా గ్రామాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. అంతేకాకుండా.. ఈ రాత్రికి ఆయా గ్రామాల ప్రజలకు భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి.. ఇక, రేపటి నుంచి వాలంటీరే వచ్చి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇస్తారని.. ఆ తర్వాత మెడికల్ క్యాంప్ పెట్టాలని నిర్ణయించామని వెల్లడించారు.