ఏపీ : ఓటర్లకు శ్రీవారి లడ్డు పంచుతున్న సర్పంచ్‌ అభ్యర్థి

ఏపీ : ఓటర్లకు శ్రీవారి లడ్డు పంచుతున్న సర్పంచ్‌ అభ్యర్థి

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య హోరా హోరీగా పోటీ నడుస్తోంది. అయితే.. ఈ ఎన్నికల్లో చాలా అరుదైన ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో ఓటర్లకు ఏకంగా శ్రీవారి లడ్డూలు పంచుతున్నాడు ఓ సర్పంచ్‌ అభ్యర్థి. అది కూడా రేషన్‌ పంపిణీ చేసేందుకు ఉపయోగించే వాహనం ద్వారానే కానిచ్చేస్తున్నాడు. వాహనం నిండా లడ్డూల సంచుల్ని వేసుకున్న సర్పంచ్‌ అభ్యర్థి... SC, STలకు ఐదు లడ్డూల చొప్పున, ఇతర కులాల వారికి పది లడ్డూల చొప్పున పంచుతున్నాడు. ఈ తంతంగాన్ని మొత్తం స్థానిక యువకులు సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించారు. ఈ ఘటనపై సర్పంచ్‌ అభ్యర్థి నిర్వాకంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.