ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఎస్ఈసికి షాక్ ఇచ్చిన హైకోర్టు...

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఎస్ఈసికి షాక్ ఇచ్చిన హైకోర్టు...

ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10 వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.  అయితే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.  తిరుపతి, పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల లోని 14 వార్డులకు రీ నామినేషన్లకు ఎస్ఈసి అవకాశం కల్పించింది.  అయితే, దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది.  దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎస్ఈసి ఆదేశాలను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని ఆదేశించింది.  ఇక వాలంటీర్లపై కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది.  వాలంటీర్ల నుంచి ఫోనులు స్వాధీనం చేసుకోకూడదని కోర్టు ఆదేశించింది.