బిగ్‌ బ్రేకింగ్‌: పరిషత్ ఎన్నికలకు బ్రేక్..

బిగ్‌ బ్రేకింగ్‌: పరిషత్ ఎన్నికలకు బ్రేక్..

ఆంధ్రప్రదేశ్‌లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు బ్రేక్ వేసింది హైకోర్టు... ఓవైపు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లలో మునిగిపోయిన సమయంలో.. పరిషత్ ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.. కోడ్ అమల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పాటించలేదన్న సూచనలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిషత్ ఎన్నికల నిర్వహణను సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ.. హైకోర్టును ఆశ్రయించగా.. బీజేపీ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. టీడీపీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది.. కాగా, ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసుకున్న వేళ.. హైకోర్టు స్టే ఇవ్వడంతో.. ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారిపోయింది... ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.. అయితే, ఈ కేసులో ఈ నెల 15వ తేదీన అఫిడవిట్ దాఖలు ఎస్‌ఈసీని ఆదేశించింది హైకోర్టు. దీంతో.. పరిషత్ ఎన్నికలు బ్రేక్‌ పడినట్టు అయ్యింది.