పూర్తి జీతం ఇవ్వాల్సిందే... ఏపీ ప్రభుత్వ జీవో కొట్టేసిన హైకోర్టు

పూర్తి జీతం ఇవ్వాల్సిందే... ఏపీ ప్రభుత్వ జీవో కొట్టేసిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. విశాఖ రిటైర్డ్ జడ్జి కామేశ్వరి పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో 50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్న ఏపీ ప్రభుత్వ జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అంతే కాక  మార్చి, ఏప్రిల్ నెలల్లో 50% బకాయి పడిన జీతాలు, పెన్షన్లను 12% వడ్డీతో చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కరోనా వలన ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందులు కారణంగా 50 శాతం మాత్రమే చెల్లిస్తున్నామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టేసింది.