కోర్టు ధిక్కరణ.. ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష

కోర్టు ధిక్కరణ.. ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కార్యదర్శి శిక్ష విధించింది రాష్ట్ర హైకోర్టు.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో 2017లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో.. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా తేల్చింది హైకోర్టు... డిసెంబర్ 31వ తేదీన కోర్టుకు హాజరుకావాలన్న ఆదేశాలతో.. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోర్టుకు హాజరయ్యారు... దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కోర్టు సమయం ముగిసేవరకు కోర్టులోనే కూర్చోవాలని ఆదేశించింది న్యాయస్థానం.. అలాగే ఆయనకు వెయ్యి రూపాయాలు జరిమానాగా విధించింది.