తెలకపల్లి రవి : లేఖ దర్యాప్తు పై హైకోర్టు స్టే, ఎస్‌ఇసి ఆరోపణతో మరో వివాదం? 

తెలకపల్లి రవి : లేఖ దర్యాప్తు పై హైకోర్టు స్టే, ఎస్‌ఇసి ఆరోపణతో మరో వివాదం? 

తెలకపల్లి రవి

ఏపీ రాజకీయాలలో, ఉన్నత న్యాయస్థానాలో అత్యంత వివాదాస్పదంగా మారిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. గతంలో ఆ స్థానంలో వుండి మధ్యలో స్థానం కోల్పోయి హైకోర్టు తీర్పు సుప్రీం కోర్టు జోక్యంతో మళ్లీ నియమితులైన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హైకోర్టుకు చేసిన తాజా ఫిర్యాదు అందుకు కారణమైంది. కమిషన్‌ సహాయ కార్యదర్శిగా వున్న సాంబమూర్తి కూడా తన నుంచి సిఐడి అధికాయి కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ను పెన్‌డ్రైవ్‌ను తీసుకువెళ్లారంటూ పిటిషన్‌ వేశారు. ఈ రెంటినీ కలిపి వచ్చే సోమవారం విచారిస్తామంటూ సిఐడి విభాగాన్ని కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తమ సిబ్బందిని వేధిస్తున్నారని ఎన్నికల కమిషనర్‌ చేసిన ఫిర్యాదు వాస్తవానికి ఆయన గతంలో రాసిన లేఖకు సంబంధించి సిఐడి మొదలుపెట్టిన దర్యాప్తును ఆపడానికి దారితీసింది. ఎందుకంటే దాన్ని నిలిపేయాని హైకోర్టు ఆదేశించింది. 

ఇప్పుడొక సారి వెనక్కువెళితే ప్రభుత్వానికి సమాచారం లేకుండా  స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం ముఖ్యమంత్రితో జగన్‌ తో సహా పాలకపక్షీయుల విమర్శలకు ఆరోపణకు గురైంది. దానిపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి చెప్పి వుండాల్సిందని అయితే కరోనా నేపథ్యంలో వాయిదా సరైందేనని మ మార్చి 18న తీర్పు వచ్చింది. దానికి ముందు రోజునే మార్చి 17న  ఎన్నికల కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖకు  రమేష్‌కుమార్‌ లేఖ రాసినట్టు మీడియాలో లీకేజి వచ్చింది. ఈ లేఖ ఆయన రాయలేదని టిడిపి నాయకులి రాసి పంపితే సంతకం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. దాన్ని సూటిగా ధృవ పర్చేందుకు ఆయన సిద్ధం కాలేదు. అస్పష్టంగా ఒక న్యూస్ ఏజన్సీతో స్పందించారు. 

కొన్ని రోజుల తర్వాత కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తమకులేఖ అందిందని ఆయన భద్రతకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఏప్రిల్‌ మూడవ వారంలో నిమ్మగడ్డ తన స్థానంలో మరొకరిని నియమించడం చెల్లదని హైకోర్టుకు వెళ్లారు. ఖచ్చితంగా ఆ సమయంలోనే వైసీపీ కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎన్నికల కమిషనర్‌ పేరిట వున్న లేఖ ఫోర్జరీ అని పోలీసుకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకూ అస్పష్టంగానే స్పందిస్తున్న నిమ్మగడ్డ ఆ రోజున మాత్రం సూటిగా లేఖ అనేది తనకూ హోంశాఖకు మధ్య వ్యవహారమనీ ఇతరుల జోక్యం అనవసరమనీ ప్రకటించారు. దానిపై వెంటనే రంగంలోకి దిగిన సిఐడి సాంబమూర్తి దగ్గర వాంగ్మూలం తీసుకుని కంప్యూటర్‌నూ పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

లేఖ మరో చోట నుంచి వచ్చి వున్నా ఒరిజినల్‌ ధ్వంసం చేసివుండొచ్చని సిఐడి విభాగం అధికారి సునీల్‌ కుమార్‌ వెల్లడించారు. ఈలోగా సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పునే అమలు చేయాలని కోరడం, నిమ్మగడ్డ గవర్నర్‌ను అభ్యర్థించి పునర్నియామకం పొందడం జరిగిపోయాయి. ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ సంబంధాలు ఎలా వుంటాయనే దానిపై వూహాగానాలు నడుస్తున్నా వివాదాలు రాలేదు. కాకుంటే ఎన్నికల నూతన షెడ్యూుల్ పేరిట సోషల్‌ మీడియాలో చలామణి అవుతున్నదని నిజం కాదని కమిషనర్‌ శనివారం ఖండించి ఆ తర్వాత ఫిర్యాదు చేశారు. శనివారం నాడే ఆయన గత వివాదాల ప్రస్తావన లేకుండా తన సిబ్బందిని సిఐడి వేధిస్తున్నారని కంప్యూటర్‌ తీసుకెళ్లారని కోర్టులో ఫిర్యాదు చేశారు.  రాజ్యాంగ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ప్రభుత్వ కార్యదర్శితో సహా పోలీసు   ఉన్నతాధికారును ప్రతివాదులుగా చేర్చారు. 

ఆ లేఖ  గురించిగాక ఎన్నికల వివరాలను తొసుకోవడానికి ఆసక్తి చూపారని  కూడా ఆరోపణ చేశారు.  మరోవైపున ఇప్పుడు పేరు వినిపించిన సాంబమూర్తి కూడా పిటిషన్ వేశారు. విచారణ మొదలెట్టిన కోర్టు కోర్టు సిఐడి దర్యాప్తుపై స్టే విధించింది. అంటే  ఇక మధ్యలో నిమ్మగడ్డ లేఖకు సంబంధించిన వివాదంలో పోలీసు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి అవకాశం వుండదు. పైగా తమ మీద వచ్చిన ఆరోపణకు సమాధానం ఇచ్చుకోవసి వుంటుంది. మరి ప్రభుత్వాధికారులు,  పోలీసు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సిందే. ఎన్నిలు కమిషన్‌కు ప్రభుత్వం పోలీసుకు మధ్య ఇది న్యాయ వివాదంగా మారనుంది.