ఏపీ పరిపాలన రాజధాని శంకుస్థాపన వాయిదా... ఇదే కారణమా...!!

ఏపీ పరిపాలన రాజధాని శంకుస్థాపన వాయిదా... ఇదే కారణమా...!!

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖలో ఈనెల 16 వ తేదీన మొదట శంకుస్థాపన చేయాలని అనుకున్నారు.  మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు ఆమోదం తరువాత హైకోర్టులో కేసులు ఫైల్ కావడం, పరిపాలన రాజధాని విషయంలో హైకోర్టు స్టేటస్ కో విధించడంతో మరలా మొదటికి వచ్చింది.  మూడు రాజధానుల అంశంపై ఏపి ప్రభుత్వం అటు సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.  

అంతేకాకుండా, ఏపీ పరిపాలన రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించారు.  అక్కడి నుంచి ఎలాంటి సమాచారం కూడా లేకపోవడంతో రాజధాని శంకుస్థాపనను తాత్కాలికంగా ప్రభుత్వం వాయిదా వేసింది.  దసరా సమయంలో శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఈలోగా రాజధానిపై నెలకొన్న అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.