దేవదాయ శాఖ ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్...

దేవదాయ శాఖ ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్...

దేవాదాయ శాఖ ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏసీబీ సోదాల అనంతరం దుర్గ గుడిలో ఉద్యోగుల అవినీతి లీలలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారుల అప్రమత్తం అయ్యారు. దుర్గగుడి తరహాలోనే మరికొన్ని ప్రముఖ దేవాలయాల్లోని ఉద్యోగులు, సిబ్బంది అవినీతి కార్యకలాపాలను వెలికి తీసేలా చర్యలు చేపట్టనున్నారు. దేవాదాయ శాఖలో పరిపాలనా పరమైన అంశాల్లోనూ ప్రక్షాళన చేపట్టేలా ప్రణాళికలు రూపొందించనుంది ఏపీ ప్రభుత్వం. నిబంధనలకు విరుద్దంగా పోస్టింగులు తెచ్చుకుంటున్న వారిపై దృష్టి సారించారు ఉన్నతాధికారులు. డీసీలు, ఏసీల స్థాయిల్లో కొందరు నియమావళికి విరుద్దంగా పోస్టుల్లో కొనసాగుతుండడంపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం.