రాజధాని భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ముందడుగు

రాజధాని భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ముందడుగు

అమరావతి రాజధాని భవనాల నిర్మాణంపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అసంపూర్తి భవనాల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించింది. రూ. 3 వేల కోట్ల మేర ఎమ్మార్డీఏకు ఏపీ కెబినెట్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చింది. అసంపూర్తి భవనాల నిర్మాణం కొనసాగింపుపై గతంలోనే సీఎస్ నేతృత్వంలోని తొమ్మిది సభ్యుల  కమిటీ భేటీ ఏర్పాటయింది. అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి రూ. 2154 కోట్లు నిధుల అవసరమని సీఎస్ కమిటీ ప్రాథమిక అంచనా వేసింది. కాంట్రాక్టర్ల చెల్లింపుల నిమిత్తం సుమారుగా మరో రూ. 300 కోట్లు అవసరమని కమిటీ భావించినట్టు చెబుతున్నారు. కరకట్ట రోడ్డు, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధుల సమీకరణకు గతంలోనే సీఎం ఆదేెశాలు జారీ చేశారు. 70 శాతానికి పైగా పూర్తైన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గతంలోనే కమిటీ అభిప్రాయ పడింది. కమిటీ సూచనల మేరకు బ్యాంక్ గ్యారెంటీకి కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది.