ఏపీలో దేవాలయాల రగడ... విచారణకు ఆదేశం... 

ఏపీలో దేవాలయాల రగడ... విచారణకు ఆదేశం... 

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల రగడ కొనసాగుతోంది.  పిఠాపురం, నెల్లూరు బిట్రగుంట, అంతర్వేది ఘటనల తరువాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవాలయంలోని రథంలో  ఉండాల్సిన నాలుగు వెండి సింహాల ప్రతిమల్లో మూడు మాయం అయ్యాయి.  దీంతో మరోసారి దేవాలయాల గురించి చర్చకు వచ్చింది.  మూడు సింహాల ప్రతిమలు మాయం కావడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.  ఈరోజు అయన దుర్గగుడి ఆలయాన్ని, ఆలయంలోని ఉత్సవ రథాన్ని సందర్శించారు.  గత 18 నెలలుగా రథాన్ని బయటకు తీయలేదని అధికారులు చెప్తున్నారు.  మూడు సింహాల ప్రతిమలు ఏమయ్యాయి అనే అంశంపై దేవాదాయ శాఖ సైతం సీరియస్ అయ్యింది.  దేవాదాయ కమిషనర్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది.  ఆలయంలోని రథంపై ఉన్న సింహాల బొమ్మలు ఎప్పుడు మాయం అయ్యాయి, ఎలా మాయం అయ్యాయి అనే విషయాలపై కమిటీ విచారణ చేపట్టబోతున్నది.  మూడు సింహాల ప్రతిమలు ఏమయ్యాయి అనే విషయాన్ని త్వరలోనే తేలుస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.  ఇక ఇదిలా ఉంటె, విజవాడ రూరల్ లోని నిడమానూరులోని సాయిబాబా దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.  సమాచారం అందుకున్న పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.  ధ్వంసమైన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  వరసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండటంతో హిందూ సంస్థలు ఆందోళనలు చేస్తున్నాయి.