రైతులకు జగన్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల..

రైతులకు జగన్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల..

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఓవైపు కరోనాతో పోరాటం చేస్తూనే మరోవైపు.. రైతు భరోసా తొలి విడత చెల్లింపులకు నిధులు విడుదల చేసింది వైసీపీ సర్కార్.. తొలి విడతలో రూ. 409.47 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. రాష్ట్రంలోని సుమారు ఏడు లక్షల మంది రైతులకు తొలి విడతలో అబ్ధి చేకూరనుంది.. ఇక, రేపటి  నుంచి తొలి విడత రైతు భరోసా చెల్లింపులు జరపనుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఇప్పటికే లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు అధికారులు.