తుంగభద్ర పుష్కారాలు: భద్రత కోసం రూ.5 కోట్ల నిధులు 

తుంగభద్ర పుష్కారాలు: భద్రత కోసం రూ.5 కోట్ల నిధులు 

నవంబర్ 20 వ తేదీ నుంచి డిసెంబర్ 1 వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ పుష్కరాల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.  తుంగభద్ర పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసింది.  ఈ పుష్కరాల కోసం మొత్తం 21 ఘాట్లను ఏర్పాటు చేశారు.  ఈ ఘాట్లలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. గతంలో ప్రభుత్వం ఘాట్ల ఏర్పాట్ల కోసం రూ.200 కోట్లు రిలీజ్ చేసింది.  కరోనా తీవ్రత దృష్ట్యా ఈ పుష్కరాలను ఎలా నిర్వహించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.